అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి వరకు బిజీ

by | Feb 11, 2025 | సినిమా

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి వరకు బిజీ.  ఈ మధ్యనే సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి వచ్చే రెండు సంక్రాంతి సీజన్లకు ప్లాన్ చేసేసుకున్నాడు 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా కు సంబంధించిన చర్చలు నడిస్తున్నాయి.  కధ ఫైనలైజ్ కాగానే, ఈ వేసవిలో షూట్ ప్రారంభమవుతుంది.  వచ్చే సంక్రాంతికి అంటే 2026 జనవరి లో ఈ సినిమా విడుదలవుతుంది.  ఈ చిత్రానికి కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు.  ఈ సినిమాకు దర్శకుడు రాఘవేంద్ర రావు ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్ సజెస్ట్ చేశారట. 

ఈ సినిమా అయిన వెంటనే, వెంకటేష్ తోనే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గాని లేదా వేరే కొత్త కధతో గాని సినిమా ప్రారంభమవుతుంది.  ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదలవుతుంది.

సంక్రాంతికి వస్తున్నాం బిగ్ హిట్ తో టాప్ లీగ్ దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు అనిల్ రావిపూడి