తెలుగు సినిమా ప్రముఖుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందా? హీరోల అభిమానుల మధ్య ఎందుకు ఇంత వైరం?
ఈ మధ్య తెలుగు సినిమా సెలెబ్రిటీలు మాట తడబడుతున్నారు. ఆ మధ్య సంక్రాంతి వస్తున్నాం కు సంబంధించిన ఒక ఈవెంట్ లో దిల్ రాజు వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేగింది. అదే ఈవెంట్ లో యాంకర్ శ్రీ ముఖి రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనేసింది. ఈ వివాదం పై పెద్ద దుమారం రేగింది.
ఈ మధ్యనే తండేల్ ఈవెంట్ లో సీనియర్ నిర్మాత అయినా అల్లు అరవింద్ సైతం మాట తూలాడు. రామ్ చరణ్ సినిమా ప్లాప్ అని పరోక్షంగా కామెంట్ లు చేసి నెటిజెన్ల ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇక లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వి చేసిన కామెంట్లు వైస్సార్సీపీ నేతల ఆగ్రహానికి గురయ్యాయి. దానితో వైస్సార్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా సాక్షిగా boycottLaila కు పిలుపునిచ్చారు. దానితో నిర్మాత గారపాటి సాహు, హీరో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి వచ్చింది
పుష్ప-2 చేసిన రచ్చ వలన ఎంత మంది ఇబ్బంది పడ్డారో అందరికి తెలుసు. అందులో నుండి బయటపడేలోగా వరస వివాదాలు. సీనియర్ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ లు సైతం క్షమాపణలు చెప్పి, వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
పైకి మేమంతా బావున్నాం అంటున్నా, సినిమా హీరోలలో కూడా క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయా. అందరితో సినిమాలు తీసే నిర్మాతలు సైత మాట తూలడం ఎందుకు. ఎందుకీ దుస్థితి
ఇవి కాకుండా పైరసీ, సినిమా లీకులతో సరి కొత్త సమస్యలు. హీరో అభిమానుల మధ్య నెగటివిటీ. సోషల్ మీడియా సాక్షి తన్నుకుంటున్నారు. వీళ్లకు వాళ్ళ కెరీర్, జీవితాల మీద కూడా అంత శ్రద్ధ ఉంటుందో లేదో తెలీదు కానీ. సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ పెట్టడానికి ఎవరు వెనుకాడట్లేదు. కొంత మంది పరుష పదజాలం కూడా వాడుకున్నారు
ఈ పరిస్థితికి కారణం కొంతవరకు అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. మెగా ఫాన్స్, అల్లు ఫాన్స్ వేరని బహిరంగంగా చెప్పడం, సంధ్య థియేటర్ సంఘటన, అల్లు అర్జున్ ఒక రోజు రాత్రి జైలు లో ఉండడం, ఆ తర్వాత అనవసరమైన వ్యాఖ్యలు చేయడం. అప్పటినుండి తెలుగు సినీ పరిశ్రమలో వాతావరణం కలుషితమైందని చెప్పవచ్చు.
తెలుగు సినీ పరిశ్రమలో నిజంగా ఆరోగ్యకరమైన వాతావరణం ఉందా. ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న
ఇవన్నీ ఇలా అనుకుంటే, ఈ మధ్య తెలుగు సినిమా వాళ్ళు మాట్లాడే మాటలకు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు
మారాలి. అంతా మారాలి. అందరు మారాలి. ఎప్పుడో, ఎలాగో ఎవరికి తెలియదు

