తెలుగు హీరోల లేడీ గెటప్ లు

by | Feb 11, 2025 | ప్రగడ టీవీ

విశ్వక్ సేన్ హీరో గా నటిస్తున్న లైలా సినిమా ఈ నెల 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాపై అంతగా అంచనాలు ఏర్పడడానికి కారణం విశ్వక్ సేన్, లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. గతంలో ఎవరెవరు ఏ సినిమాలలో లేడీ గెటప్ లు వేశారో చూద్దాం.

లేడీ గెటప్ గురించి చెప్పుకోవాలంటే మొదట చెప్పుకోవలసింది సీనియర్ నటుడు నరేష్ నటించిన చిత్రం భళారే విచిత్రం.  ఈ సినిమాలో నరేష్ లేడీ గెటప్ లో కడుపుబ్బ నవ్విస్తాడు. ఈ సినిమాకు పి ఎన్ రామచంద్ర రావు దర్శకత్వం వహించారు.  ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది

మెగాస్టార్ చిరంజీవి జంధ్యాల దర్శకత్వం  చంటబ్బాయి సినిమా లో ఒక పాట కోసం లేడీ గెటప్ వేశారు.  ఆ పాటలో సుహాసిని గుర్తుపట్టకుండా ఫాలో అవడానికి వేసే అనేక రకాల వేషాలలో ఈ లేడీ గెటప్ ఒకటి

ఆ తర్వాత పాండురంగడు లో బాల కృష్ణ కొన్ని సెకన్ల పాటు లేడీ గెటప్ లో కనిపిస్తాడు. 

వాసు, బాడీ గార్డ్ చిత్రాలలో విక్టరీ వెంకటేష్ కూడా లేడీ గెటప్ లో కనిపిస్తాడు.

అల్లు అర్జున్ హీరో గా తన మొదటి సినిమా గంగోత్రి లో లేడీ గెటప్ లో కనిపిస్తాడు. లేడీ గెటప్ లో ఒక పాట కూడా ఉంటుంది

పాండవులు పాండవులు తుమ్మెద లో మంచు మనోజ్  లేడీ గెటప్ లో కనిపిస్తాడు

మేడమ్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూడా లేడీ గెటప్ లో కనిపిస్తాడు

కితకితలు సినిమాలో, అల్లరి నరేష్ కూడా లేడీ గెటప్ లో కనిపించి నవ్వులు పూయిస్తాడు

అయితే లేడీ గెటప్ లో ఎవరెన్ని వేషాలు వేసిన సీనియర్ నటుడు నరేష్ నటించిన ‘చిత్రం భళారే విచిత్రం’ సూపర్ హిట్ అయినంతగా ఏ సినిమాలు హిట్ అవలేదు. 

లైలా సినిమా ట్రైలర్ చూస్తే పరవాలేదనిపిస్తోంది.  అయితే ఎగ్జామ్స్ సీజన్లో కంటెంట్ మరింత స్ట్రాంగ్ గా ఉంటేనే ఆడియన్స్ సినిమా చూడడానికి థియేటర్ కు వస్తారు.

లైలా సినిమాకు ‘ఆ’ సర్టిఫికెట్ రావడం మాత్రం హర్షించదగ్గ పరిణామం కాదు.  పిల్లని వదిలేసి తల్లి తండ్రులు సినిమాకు రాలేరు.  ఈ సినిమా యూత్ కి, యంగ్ ఆడియన్స్ కి నచ్చడం పై ఈ సినిమా విజయం ఆదాహారపడి ఉంది