నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘అఖండ 2’. ‘అఖండ’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ
సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా పూర్తికాక ముందే బాలయ్య తన తర్వాతి సినిమాను ఓకే చేశారని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం బాలయ్య తన తర్వాతి సినిమాను దర్శకుడు హరీష్ శంకర్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోసం హరీష్‌శంకర్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయగా.. ఇటీవలే బాలయ్యకు వినిపించారట. హరీష్‌శంకర్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో బాలయ్య వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.
నిజానికి హరీష్ శంకర్‌కు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే, వరుస హిట్లతో బాలయ్య ప్రస్తుతం దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్ సినిమాలు బాక్సఫీస్ దుమ్ము దులిపేశాయి. ఇలాంటి సమయంలో హరీష్ శంకర్ సాలీడ్ స్క్రిప్ట్ తో మూవీ చేస్తే అది సూపర్ హిట్ అవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య, హరీష్ శంకర్ కాంబోలో సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

