మీడియా ఇండస్ట్రీ లో అతి పెద్ద మెర్జర్ డిస్నీ స్టార్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్.
డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ అధీనం లో ఉన్న వయాకామ్ 18 జాయింట్ వెంచర్ జియో స్టార్ గా అవతరించింది. ఈ జాయింట్ వెంచర్ లో 100 పైగా చానెల్స్ మరియు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ట్ లు ఉన్నాయి
రిలయన్స్ ఇండస్ట్రీస్ 11,500 కోట్లను గ్రోత్ కాపిటల్ గా ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ 16.34% వాటాను కలిగి ఉంది. వయకామ్ 46.82% వాటాను కలిగి ఉంది.
డిస్నీ 36.84% వాటాను కలిగి ఉంది. ఈ జాయింట్ వెంచర్ కు నీతా అంబానీ చైర్మన్, ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ రోజు నుండి డిస్నీ హాట్ స్టార్ జియో హాట్ స్టార్ గా మారుతోంది.
జియో హాట్ స్టార్ కు 50 కోట్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అంతే కాకుండా వీళ్ళ వద్ద ఉమ్మడిగా 3 లక్షల గంటల కు పైగా కంటెంట్ ఉంది
ఈ జాయింట్ వెంచర్ ఏర్పడ్డాక ఇదే అతి పెద్ద నిర్ణయం. ముందు ముందు మీడియా ఇండస్ట్రీలో ఈ జాయింట్ వెంచర్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

