నటసింహం నందమూరి బాలయ్య (Bala Krishna) కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’(Akhanda) ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అఘోరా గెటప్ లో బాలయ్య (Balayya) మీద ఓ మేజర్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నారని సమాచారం. సినీ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ చూపించని హిమాలయాల లొకేషన్లలో షూటింగ్ చేయనున్నారని.. ఈ సన్నివేశాలు మూవీలో మెయిన్ హైలైట్ కానున్నాయని చెబుతున్నారు.
మరోవైపు ఈ మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్‌కి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా కానిచ్చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కాగా, ఈ సినిమాను పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో వివిధ భాషలనుంచి నటీనటులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా, అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman_ ఈ సంగీతం అందిస్తున్నారు.దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

