WPL : ఆర్సీబీ పై ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం

by | Mar 1, 2025 | వార్తలు

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (Royal Challengers Bangalore) 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 

9 పరుగులకే, స్మృతి మంధన రూపంలో మొదటి వికెట్ కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు హాడ్జ్, పెర్రీ రెండవ వికెట్ కు చేసిన 44 పరుగుల భాగస్వామ్యం తేరుకునేలా చేసింది

హాడ్జ్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యింది.  ఆ తరవాత వచ్చిన బిస్త్ తో జత కలిసిన పెర్రీ మూడవ వికెట్ కు 66  పరుగులు జోడించారు

33 పరుగులు చేసిన బిస్త్ అవుట్ అయ్యిన తరవాత పెర్రీ కి సహకారం అందించే వారే కరువయ్యారు.  పెర్రీ 47 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే, శ్రీ చరని చెరో రెండు వికెట్లు తీశారు. కాప్ ఒక వికెట్ తీసింది

అనంతరం 148 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదట్లోనే కీలకమైన కెప్టెన్ మెగ్ లానింగ్ వికెట్ ను కోల్పోయింది. 2 పరుగులు చేసిన లానింగ్ రేణుక సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యింది

షెఫాలీ వర్మ, జెస్ జొనాసేన్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు.  వీరిద్దరూ రెండవ వికెట్ కు అజేయంగా 146 పరుగులు జోడించారు

షెఫాలీ వర్మ (Shefali Varma) వీర విహారం చేస్తూ కేవలం 43 బంతుల్లో 80 పరుగులు చేసింది.  ఇందులో 4 సిక్సర్లు, 8 ఫోరులు ఉన్నాయి.  జొనాసేన్ కూడా ధాటిగా ఆడుతూ 38 బంతుల్లో 61 పరుగులు చేసింది.  ఇందులో ఒక సిక్సర్, 9 ఫోర్లు ఉన్నాయి

ఢిల్లీ క్యాపిటల్స్ 148 పరుగుల లక్ష్యాన్ని, షెఫాలీ వర్మ, జొనాసేన్ వీర విహారం చేయడంతో 15.3 ఓవర్ల లో కరిగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 15.3 ఓవర్ల లో ఒక వికెట్ నష్టానికి 151 పరుగులు చేసింది.

వరస విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు మీదుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం లో కొనసాగుతోంది