యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల యాషెస్ టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియా 4-1 తో గెలుచుకుంది.
ఆట ఆఖరు రోజు రెండవ ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు 342 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. యువ ఆటగాడు జాకబ్ బెథెల్ 154 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, వెబ్ స్టర్ లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. బొలాండ్ రెండు వికెట్లు, నెజర్ ఒక వికెట్ తీసుకున్నారు
అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, వెధరాల్డ్ లు 62 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. ట్రావిస్ హెడ్ 29 పరుగులు, వెధరాల్డ్ 34 పరుగులు లబు షేన్ 37 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తరవాత వచ్చిన, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 12 పరుగులు, ఆఖరి మ్యాచ్ ఆడుతోన్న ఖవాజా 6 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అవడంతో ఇంగ్లాండ్ కు గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే క్యారీ, గ్రీన్ లు మరో వికెట్ పడకుండా ఆస్ట్రేలియాను గెలిపించారు. క్యారీ 16 పరుగులు, గ్రీన్ 22 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. స్వల్ప లక్ష్యం కావడంతో, ఆస్ట్రేలియా ఛేదన వన్ డే తరహాలో సాగింది
మొత్తం ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 192 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆసాంతం రాణించి 31 వికెట్లతో 156 పరుగులు చేసిన స్టార్క్ కు ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ను నిలుపుకోవడం ఇది ఆరోసారి. గత 5 సిరీస్ లలో మూడు సార్లు 4-0/4-1 తో సిరీస్ గెలిస్తే, రెండు సార్లు 2-2 తో సిరీస్ సమం చేసి యాషెస్ ట్రోఫీ ని నిలుపుకుంది

