జన నాయకుడు ట్రైలర్ చివరలో తిరిగి వెళ్లే ఐడియానే లేదు. ఐ యామ్ కింగ్ అంటూ తన రాజకీయ అరంగేట్ర ఉద్దేశాన్ని తమిళ సూపర్ స్టార్ విజయ్ గట్టిగా చెప్పకనే చెప్పాడు.
అయితే ట్రైలర్ విడుదలైన తరవాత నుండి దళపతి విజయ్ కు కష్టాలు మొదలయ్యాయా అంటే మొదలయ్యాయి అని చెప్పవచ్చు. విజయ్ ఆఖరి సినిమా అయిన జన నాయకుడు సినిమా కు ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. అంతకు ముందు సెన్సార్ వాళ్ళు సూచించిన విధంగా సినిమా కాపీ ని రెడీ చేసి సెన్సార్ కు మళ్ళీ పంపించారు. అయినా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నిర్మాతలు మద్రాస్ హై కోర్ట్ లో కేసు వేశారు. దీనికి సంబందించిన తుది తీర్పు రేపు అనగా జనవరి 9 న విడుదలవుతుంది. ఇదే రోజు జన నాయకుడు సినిమా విడుదల కావాల్సి ఉంది .
కోర్ట్ తీర్పు, ఆ తరవాత సెన్సార్ సర్టిఫికెట్ రావాలి, ఓవర్సీస్ కు ప్రింట్ లు పంపాలి. అనిశ్చితి నెలకొన్న ఈ సందర్భంలో సినిమాని వాయిదా వేశారు. కె వి యెన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వినోద్ దర్శకుడు.
ఇది ఇలా ఉంటే సరిగా ఇదే సమయంలో విజయ్ కు మరో తలనొప్పి వచ్చి పడింది. కరూర్ తొక్కిసలాటకు సంబందించిన ఘటనలో సిబిఐ, విజయ్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసు ప్రకారం జనవరి 12 న ఢిల్లీ సిబిఐ ఆఫీస్ లో విజయ్ హాజరు కావాల్సి ఉంది.
మరో పక్క బుక్ మై షో నిర్వహకులు ఇప్పటికే జన నాయకుడు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లకు డబ్బులు తిరిగి ఇచ్చే ప్రక్రియ ను ప్రారంభించారని తెలుస్తోంది.
ఈ దెబ్బకు ప్రభాస్ రాజా సాబ్ కు కలిసి వస్తుంది. రాజా సాబ్ చిత్రానికి థియేటర్లు పెరిగి తద్వారా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
జన నాయకుడు సినిమా తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాల కృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రానికి దాదాపుగా ఫ్రీమేక్ అని చెప్పవచ్చు. విజయ్ రాజకీయ అరంగేట్రానికి సంబందించిన డైలాగులతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తయారుచేశారు.

