మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం నుండి టైటిల్ సాంగ్ ను ఈ రోజు జరుగుతోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేశారు. ఈ పాటకు ఆట సందీప్ హుక్ స్టెప్స్ కంపోజ్ చేశాడు.
అభిమానుల కేరింతల మధ్య విడుదల చేసిన ఈ పాట ను, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆట సందీప్ ఈ పాటకు డాన్స్ చేశారు
మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ ఈవెంట్ కు మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పేరు పెట్టారు. ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరు హాజరయ్యారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు. జనవరి 12 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. జనవరి 11 రాత్రి నుండి ప్రీమియర్ సందడి మొదలవుతోంది.

