యాషెస్ సిరీస్ లో భాగంగా ఈ రోజు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన నాలుగవ టెస్ట్ మొదటి రోజు ఆటల్లో 20 వికెట్లు పడ్డాయి.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో 152 పరుగులకే కుప్ప కూలింది. 35 పరుగులు చేసిన మైఖేల్ నెజర్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్.
ఇంగ్లాండ్ పేసర్ జోష్ టంగ్ 5 ఐదు వికెట్లు తీసుకోగా,అట్కిన్సన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. కార్స్, స్టోక్స్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు
ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేశామన్న ఆనందం ఇంగ్లాండ్ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 110 పరుగులకే కుప్ప కూలింది.
ఇంగ్లాండ్ చేసిన 110 పరుగులలో 41 పరుగులు హరీ బ్రూక్ చేసినవే. ఇతనే ఇంగ్లాండ్ జట్టులో టాప్ స్కోరర్.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ నెజర్ నాలుగు వికెట్లు తీసుకోగా, బొలాండ్ మూడు వికెట్లు, స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు. గ్రీన్ కు ఒక వికెట్ దక్కింది.
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. మొత్తంగా ఆస్ట్రేలియా 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా గెలవడం దాదాపు అసాధ్యం. ఈ సారి యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ వైట్ వాష్ తప్పేలా లేదు.


