Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా లో వెంకటేష్ అతిధి పాత్రలో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే వెంకటేష్ తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి హ్యాట్రిక్ హిట్ సినిమాలు తీశాడు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సారి, చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు సినిమా లో వెంకటేష్ కు ఒక ప్రత్యేక పాత్ర సృష్టించాడు . ఈ సినిమాలో తన పాత్ర తాలూకా షూట్ పూర్తి అయిందని ఎక్స్ లో నటుడు వెంకటేష్ పోస్ట్ చేశారు
చిరంజీవి తో నటించడం ఒక గొప్ప అనుభూతి అని, ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిందన్నారు వెంకటేష్. చిరంజీవి తో ఎప్పుడు నటించాల్సి ఉంది. ఇప్పటికి అనిల్ రావిపూడి మా ఇద్దరితో సినిమా తీయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని వెంకటేష్ అన్నారు.
మీ అందరితో 2026 సంక్రాంతి ని థియేటర్ లో జరుపుకోవడానికి ఇంక నేను ఆగలేను అని వెంకటేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు

