ఆస్కార్ గెలిచిన ‘అనోరా’ సినిమా కధ ఏంటి

by | Mar 4, 2025 | సినిమా

ఆనోరా 2024 లో విడుదలైన అమెరికన్ కామెడీ డ్రామా.  సీన్ బేకర్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు, ఎడిటర్, నిర్మాత. మైకీ మాడిసన్, ఈ అనోరా సినిమాలో ఆనోరా మిఖీవా అనే పాత్రలో నటించింది

కదేంటంటే, న్యూయార్క్ లో నివసిస్తోన్న ఆనోరా అనే 23 ఏళ్ళ సెక్స్ వర్కర్. ఆమె బాస్ ఆనోరా ని, రష్యా కు చెందిన ఒక వ్యాపారవేత్త చిన్న కుమారుడి వాన్యా కి పరిచయం చేస్తుంది.  ఇతను రష్యన్ లాంగ్వేజ్ లో అనర్గళంగా మాట్లాడే వాళ్ళు కావాలని ఆనోరా బాస్ ని అడుగుతాడు. వాన్యా అమెరికాలో చదువుకుంటున్నప్పటికీ, అతను ఎక్కువగా పార్టీలు చేసుకుంటూ, వీడియో గేమ్స్ ఆడుతూ బ్రూక్లిన్ లో ఉంటుంటాడు

ఈ వాన్యా, ఆనోరా ని జాబ్ లో పెట్టుకుంటాడు.  తనతో ఉంది కొన్ని కొన్ని పనులు చేయడానికి అనోరకి 15000 డాలర్లు చెల్లిస్తాడు. ఒక సారి లాస్ వేగాస్ పర్యటనలో ఉండాగా వాన్యా, అనుకోకుండా, ఆనోరా కి ప్రపోజ్ చేస్తాడు. ఆనోరా నిజంగా మంచివాడేనా, ప్రేమిస్తున్నాడా అన్న అనుమానంతోనే వాన్యా ప్రపోజల్ ని అంగీకరిస్తుంది. ఆనోరా ఒప్పుకున్నా తడవే, వాన్యా, అనోరా లేచిపోయి పెళ్లి చేసుకుంటారు (రిజిస్టర్ మ్యారేజ్ లాంటి పెళ్లి).  అనోరా జాబ్ వదిలేసి, వాన్యా మాన్షన్ లో కి వస్తుంది

వీరిద్దరి పెళ్లి వార్త రష్యా లో ఉన్న వాన్యా తల్లి కి తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వాన్యా తల్లి, తన ఆర్మేనియన్ గాడ్ ఫాదర్ టారోస్ కి ఆర్డర్ వేస్తుంది.వాన్యా, ఆనోరా ఎక్కడున్నా వెతికి వాళ్ళ పెళ్లిని లీగల్ రద్దు చేయమని ఆర్డర్ వేస్తుంది.  ఈ లోగా భర్త నీకొలాయ్ తో మేము యు ఎస్ కు వస్తాము అని చెపుతుంది

టారోస్ గుండాలను వాన్యా ఇంటికి పంపి,  మీ తల్లి, తండ్రులు నిన్ను(వాన్యా) రష్యా కు తీసుకువెళ్లడానికి వస్తున్నారని చెప్తాడు. అంతే కాకుండా, ఆనోటా, ఒక ప్రాస్టిట్యూట్ అని కోపం తో చెపుతాడు.  వాన్యా గ్రీన్ కార్డు పొందడానికే ఆనోరా ని పెళ్లి చేసుకున్నాడని చెపుతాడు

వాన్యా అక్కడనుండి తప్పించుకుంటాడు. టారోస్ పంపిన రౌడీలతో ఆనోరా ఫైట్ చేస్తుంది. ఈ లోగా టారోస్ వచ్చి వాన్యా immaturity గురించి చెప్పి, బలవంతంగా అనోరా నుండి పెళ్లి ఉంగరం తీసుకోవడానికి, పెళ్లిని రద్దు చేయడానికి ఆనోరా కి 10 వేల డాలర్ ల ను ఆఫర్ చేస్తాడు

అనోరా టారోస్ కి చెప్తుంది. నేను, వాన్యా ప్రేమించుకున్నామని. అయితే చివరకు టారోస్, వాళ్ళ రౌడీలతో కలిసి వాన్యా గురించి ఆ రాత్రంతా బ్రూక్లిన్ లో  వెతుకుతారు.

అనోరా తన స్నేహితురాలి ద్వారా తెలుసుకుంటుంది. వాన్యా వేరే సెక్స్ వర్కర్ తో అంతకు ముందు అనోరా పని చేసిన చోట ఉన్నాడని. అప్పటికే మత్తులో ఉన్న వాన్యా ని పట్టుకుంటారు.  అయితే ఈ విడాకుల ప్రక్రియ ని డిస్మిస్ చేస్తుంది కోర్ట్ ఎందుకంటె ఈ పెళ్లి అమెరికా లోని నెవాడా ప్రాంతంలో జరిగింది కాబట్టి

ఎయిర్ పోర్ట్ దగ్గ అనోరా తనని వాన్యా తల్లి తండ్రులకు పరిచయం చేసుకుంటుంది.  వాన్యా తల్లి అనోరా తో మాట్లాడడానికి ఇష్టపడను. వాన్యా కూడా తన తల్లి, తండ్రులు ఒప్పోకోని కారణంగా, తమ వివాహ అసాధ్యమని వాన్యా, ఆనోరా తో చెపుతాడు

మొదట ఒప్పుకోకపోయినా, తరవాత వాన్యా immaturity కి, వాళ్ళ తల్లి తండ్రుల పలుకుబడి తనానికి ఆనోరా విడాకులకు ఒప్పుకుంటుంది

పేపర్ లు సంతకాలు చేసిన తరవాత, ఐగర్ (టారోస్ మనుషులలో ఒకడు) వాన్యని, ఆనోరా ని క్షమించమని అడగమంటాడు. అక్కర్లేదని వాన్యా తల్లి వరిస్తుంది. ఆనోరా, వాన్యా, వాళ్ళ తల్లి తండ్రులను వెళ్లిపోయేముందు అవమానిస్తుంది 

ఆ తరవాత ఇగోర్ ఆనోరా ని తీసుకుని మాన్షన్ కి తీసుకు వెళతాడు.  అక్కడ అనోరా తన వస్తువులని ప్యాక్ చేసుకున్న తరవాత, ఐగర్ ముందుగా చెప్పినట్లు 10 వేల డాలర్లు, పెళ్లి డైమండ్ రింగ్ తో ఆనోరా కి తిరిగి ఇస్తాడు.  ఆనోరా, ఐగర్ తో కలవడానికి ప్రయత్నించినప్పుడు, ఐగర్, ఆనోరా ని కిస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు, ఐగర్ ని ఆపిన ఆనోరా, ఏడుస్తుంది

ఒక సెక్స్ వర్కర్, ప్రజా జీవితంలోకి వచ్చి, సాధారణ జీవితం గడపడానికి వచ్చిన ఒక యంగ్ గర్ల్ కధ, ఈ అనోరా.  తాను ఎలాంటి సమస్యలు ఫేస్ చేసింది. చివరకు తన జీవితం ఎక్కడ మొదలైందో, అక్కడికే వచ్చిందా అనే అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి. 

ఆనోరా, ఉత్తమ సినిమా అవార్డు గెలుచుకోవడం పట్ల నెట్టింట, విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి