భారత సినీ చరిత్రలో ‘పుష్ప2’తో రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాడు అల్లు అర్జున్. దాంతో ఆయన తర్వాత చేయబోయే సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు బన్నీ ఏ ప్రాజెక్టుకు అంగీకారం తెలుపలేదు. పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేస్తే అభిమానులకు మరింత చేరువవుతుంది అనే విషయంలో డైలామలో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా మంది టాప్ డైరెక్టర్లు అల్లు అర్జున్ (Allu Arjun) కి కథలు వినిపిస్తున్నా బన్నీ మాత్రం తన రేంజ్ కు తగ్గట్లుగానే పాన్ ఇండియా స్థాయిలో తన తర్వాతి సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో చేయబోయే మూవీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. సోషియో, మైథలాజికల్ కాన్సెప్ట్ లో రాబోతున్న ఈ సినిమాలో శివుడి తనయుడు కార్తికేయుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారని సమాచారం.
అలానే బన్నీ, తమిళ దర్శకుడు అట్లీతో కూడా సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జవాన్ బ్లాక్ బస్టర్ తరువాత హాలీవుడ్ స్థాయిలో సినిమా చేస్తానని అట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ (Allu Arjun) కోసం అట్లీ అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ని కలిసి స్క్రిప్ట్ వినిపించగా.. కథలో పలు మార్పులు చేయాలని బన్నీ సూచించాడట. ఈ పాయింట్ దగ్గరే చర్చలు నడుస్తున్నాయని, ఏదో ఒక విషయం తేలితో త్వరలో అల్లు అర్జున్-అట్లీ (Atlee)కాంబోపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఒకవేళ అట్లీతో మూవీ ఓకే అయితే మాత్రం త్రివిక్రమ్ (Trivikram) తో చేయాల్సిన సినిమా వచ్చే ఏడాదే ప్రారంభమవుతుందనే చెప్పాలి.

