పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ అనే యంగ్ బ్యూటీ నటిస్తోంది. 1940ల్లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘ఫౌజీ’ సినిమా కథ రీత్యా ఇందులో ప్రభాస్ ను ఢీకొట్టే పాత్ర ఒకటుందట. ఆ పాత్ర కోసం దర్శకుడు హను రాఘవపూడి బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ను సంప్రదించారట.
ఇటీవలే దర్శకుడు ఆయన్ని కలిసి కథ చెప్పారని, తన పాత్రలోని కొత్తదనం నచ్చడంతో సన్నీ డియోల్ ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించారని సమాచారం. దింతో ఈ సినిమాలో సన్నీ డియోల్ విలన్‌గా నటించడం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్(Prabhas) , సన్నీ డియోల్ (Sunnydeol) పాత్రల మధ్య పోరాటం నువ్వానేనా అనే స్థాయిలో ఉంటుందట. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాట్’ (Jaat) మూవీలో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ‘ఫౌజీ’లో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ (Alia Bhat( కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నదట. కథ రీత్యా ఇందులో ఓ యువరాణి పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో అలియా కనిపిస్తుందని సమాచారం

