పుష్ప ఇక తగ్గాలి.. అల్లు అర్జున్ హీరో టు జీరో
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో వాస్తవాలు బయటికి వస్తున్నాయా. అల్లు అర్జున్ తప్పు మీద తప్పు చేస్తున్నారా. అసలు ఏం జరిగిందో చూద్దాం
పుష్ప సినిమా ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఇచ్చింది, టికెట్స్ భారీగా పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తు లేదా మన అల్లు అర్జున్ గారికి . అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు అసహజం గా, ఫేక్ గా ఉంది రేవంత్ రెడ్డి ని గౌరీనాథ్ చేసేశాడు. కవరింగ్ చేయడానికి ప్రయత్నించాడు కానీ backfire అయ్యింది.
అల్లు అర్జున్ రేవతి మృతి తరవారత విడుదల చేసిన వీడియో లో 25 లక్షలు Goodwill Gesture గా ఇస్తున్నాని చెప్పాడు. అసలు Goodwill Gesture అనే పదం ఎక్కడ వాడాలో తెలుసా అల్లు అర్జున్ కి
డిసెంబర్ 4 న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తరవాత అసలు అల్లు అర్జున్ బయటకు వెళ్లలేదా. డిసెంబర్ 12 న ఢిల్లీ లో పుష్ప సక్సెస్ సెలెబ్రేషన్స్ (thank you meet) జరిగింది. దీనిని బట్టి ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పినదంతా అబద్ధమని తెలుస్తోంది. ప్రెస్ మీట్ లో ఒక పేపర్ చూసి ప్రిపేర్ అయి వచ్చి చెపుతుంటే, చాలా అసహజంగా, ఆర్టిఫిషల్ గా ఉంది.
సుమారు 15 నిమిషాల ప్రెస్ మీట్ లో మంచి నీళ్లు తాగడం, స్పీచ్ మధ్యలో మాట్లాడకుండా ఆగిపోవడం వంటి సింపతీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ చాలా అసహజంగా ఉన్నాయి
తెలుగు వాళ్ళ పరువు ఎక్కడో నిలబెడదామనుకున్నాడట పుష్ప. తెలుగు వాళ్ళ పరువు ఎక్కడో పెట్టిన ఘనత రాజమౌళిది. మగధీర, బాహుబలి, ఈగ, ఆర్ ఆర్ ఆర్ ల గా యూనివర్సల్ acceptancy ఉన్న సినిమాలు తీయాలి పుష్ప.
తెలుగు వాళ్ళ పరువు కోసం అల్లు అర్జున్ సినిమాలు చేస్తున్నాడట – జోక్ బావుంది పుష్ప.
గంధపు చెక్కల స్మగ్లర్ ని హీరోగా చూపిస్తూ, ప్రపంచ వ్యాప్తం గా అత్యధిక థియేటర్ ల లో రిలీజ్ చేసి, టికెట్ రేట్లను భారీగా పెంచి కలెక్షన్స్ దండుకున్న పుష్ప 2 లో కంటెంట్ ఏమి లేదు సాక్షాత్తు అల్లు అర్జున్ అభిమానులే చెపుతున్నారు. పుష్ప 1 మేనియా తో బాలీవుడ్ లో కలెక్షన్స్ వచ్చాయి అంతే. పుష్ప 2 వలన తెలుగు వాళ్ళ పరువు తెలుగు స్టేట్స్ లో పోయింది
అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత, టికెట్ రేట్లు పెంచి దండుకున్నదెంత, శ్రీ తేజ్, రేవతి కుటుంబానికి ప్రకటించినదెంత, ఇచ్చినదేంత పుష్పా. అసలు విషయం ఏంటంటే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్నీ అడిగిన విలేఖరులకు అల్లు అరవింద్ సమాధానం చెప్పలేకపోయాడు
తన లాయర్ లు శ్రీ తేజ ని చూడడడానికి వెళ్లదన్నారా (అసలు తొక్కిసలాట జరిగిన రోజుకి, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే రోజు కి చాల రోజుల ఉన్నాయి). పుష్ప ఈ లాజిక్ వర్క్ అవుట్ అవలేదు. పబ్లిక్ స్పీచులు ఇచ్చేటప్పుడు చాల అలోచించి మాట్లాడాలి పుష్ప.
గతంలో ఎంతో మంది నటులు ప్రీమియర్ షోస్ కి వెళ్లారు. ఒకవేళ ఆ థియేటర్ కి హీరోలు వెళ్లాలంటే పర్మీషన్ తీస్కుని సినిమా బిగిన్ అయిన తర్వాత మెల్లగా లోపలకి వచ్చేవారు. దానికి కూడా సపరేట్ గా గేట్లు ఉండేవి. ఇప్పుడు పరిస్తితి అలా లేదు. గతంలో కూడా చాలా బెనిఫిట్ షోలు జరిగాయ్.. కానీ హీరోలు ఎప్పుడు వచ్చారు.. ఎప్పుడు వెళ్లారు అనేది కూడా తెలిసేది కాదు
ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా శ్రీ తేజ్ బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెపుంటుంటే, అల్లు అర్జున్ శ్రీ తేజ్ కోలుకుంటున్నాడని, ఫీషియో థెరపీ కూడా చేయిద్దామని అనుకుంటున్నాడట
అల్లు అర్జున్ ప్రీమియర్ షో తన పిల్లలని తీసుకుని వచ్చాడు. అల్లు అర్జున్ బౌన్సర్లు ఆ పిల్లలని ఎంత జాగ్రత్తగా తీసుకువెళుతున్నారో వీడియోలలో తెలుస్తోంది. అల్లు అర్జున్ పిల్లలు సినిమా చూడడానికి బౌన్సర్లు ఎందుకు. అల్లు అర్జున్ ఆర్మీ నుండి తన పిల్లలకు రక్షణ కోసం. శ్రీ తేజ్ ప్రొటెక్షన్ కోసం ఎవరు ఉన్నారు పుష్ప
అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో స్పీచ్ ఇస్తూ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతున్నాడు. పక్కన వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తున్నారు…ఏం కర్మ పుష్పా అల్లు అర్జున్ ప్రెస్ మీట్, నేషనల్ మీడియా కోసం కూడా కంటెంట్ ఇచ్చాడు (తానే చెప్పుకున్నాడు). ఇంట్లో కూర్చున్న కలెక్షన్స్ వివరాలు తెలుస్తాయి అల్లు అరవింద్ గారు. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన విధానం చాల అసహజంగా ఉంది
అల్లు అరవింద్, ప్రెస్ మీట్లో, మూడు తరాలనుండి ఇండస్ట్రీ లో ఉన్నాము. ఎప్పుడైనా ఇలా చేశామా అని అంటున్నాడు. అల్లు రామలింగయ్య గారు కమెడియన్ అంత స్టార్ స్టేటస్ లేదు, అల్లు అరవింద్ నిర్మాత, పబ్లిక్ లో క్రేజ్ అంతగా లేని నిర్మాత. అల్లు అర్జున్ పుష్ప తో స్టార్ స్టేటస్ సంపాదించాడు. తేడా ఉందిగా అల్లు అరవింద్ గారు. ఎదిగే కొద్దీ అణకువగా ఉండాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లో మాట్లాడిన దానికి ప్రెస్ మీట్ అవసరమా..? ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ అడ్డంగా దొరికిపోయాడా. అల్లు అర్జున్ కి పేపర్ మీద స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చారు
ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రెండు చేతులతో జుట్టు ను సర్దుకుంటున్నాడు మన పుష్ప.
నా సినిమా నేను థియేటర్ లో చూడాలి. రాబోయే సినిమాలకు లెర్నింగ్ కర్వ్ అంటున్నాడు అదేదో ఇంట్లో చూడచ్చుకదా పుష్ప.
పోలీసుల మీద, ముఖ్యమంత్రి అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యల మీద అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వేసిన కౌంటర్ కు (false allegations అని అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై) , పోలీసులు లీగల్ గా ఎలా ముందుకు వెళతారో చూడాలి
మధ్యంతర బెయిల్ మీద విడుదల అయిన అండర్ ట్రయల్ ఖైదీలు ప్రెస్ మీట్ పెట్టవచ్చా. ప్రెస్ మీట్ పెట్టి, ఎక్కువ మాట్లాడితే సమస్యలు వస్తాయి అనడం ఏంటి.
అల్లు అర్జున్ కి జరిగింది స్వయం కృతాపరాధామా. కర్మ సిద్ధాంతమా
చివరగా ఐకాన్ స్టార్ కాదు ఆటిట్యూడ్ స్టార్
.

