పుష్ప అరెస్ట్,, అల్లు అర్జున్ కి జైలు శిక్ష, గాంధీ హాస్పిటల్ లో అల్లు అర్జున్, బన్నీకి బెయిల్.. ఇవన్నీ కూడా ట్రెండింగ్ హెడ్ లైన్స్… అసలు తెర వెనుక ఏం జరిగింది… ఈ పాపం ఎవరిది.. నిజంగా అల్లు అర్జున్ తప్పుచేశాడా…
పుష్ప 2 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.. ప్రీమియర్ షోకి రంగం సిద్ధం అయ్యింది. క్రాస్ రోడ్స్ లో రాత్రి షో పడబోతోంది.. ఈ టైమ్ లో అక్కడ అపశ్రుతి.., ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన ఫ్యామిలీలో విషాదం. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి.. చావుబ్రతుకుల్లో బాలుడు. ఈ సంఘటన యావత్ సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. ఇక ఈవిషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం నేషనల్ న్యూస్ అయ్యింది. ఈ సంఘటన తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగట్లేదు. అసలు ఎందుకీ సినిమా, ఎవరిని ఉద్దరించడానికి అన్నట్లుగా మనసు ప్రశ్నిస్తోంది.
అల్లు అర్జున్ అరెస్ట్ కి అనేక కారణాలు చెప్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి కావాలనే చేశారని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరుండీ మరీ అరెస్ట్ చేయించారని సోషల్ మీడియాలో టాక్ విపిస్తోంది. అయితే, కావాలని కక్ష్యకట్టి మరీ ఇలా ఎవరైనా చేస్తారా అనే భిన్నమైన వాదన కూడా ఉంది. అల్లు అర్జున్ సిినిమాలో డైలాగ్స్ కొట్టాడని, నేనే బాస్.. వాడి కొడుక్కి, తమ్ముడికి నేనే బాస్ అన్న డైలాగ్ కోసమే ఇదంతా అనేది కూడా ఒక వర్గం వాదన. అంతేకాదు, ఈవెంట్ లో సిఎం పేరు మర్చిపోయినందుకే కక్ష్య కట్టాడని కూడా అంటున్నారు. అసలు ఈ పాపం ఎవరిది ?
ఒకప్పుడు పెద్దహీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.., ఆడవాళ్లకి , పిల్లలకి సపరేట్ బుకింగ్ ఉండేది. మనిషికి ఒక్క టిక్కెట్ మాత్రమే ఇచ్చి లోపలకి పంపించేవారు. ఒకవేళ ఆ థియేటర్ కి హీరోలు వెళ్లాలంటే పర్మీషన్ తీస్కుని సినిమా బిగిన్ అయిన తర్వాత మెల్లగా లోపలకి వచ్చేవారు. దానికి కూడా సపరేట్ గా గేట్లు ఉండేవి. ఇప్పుడు పరిస్తితి అలా లేదు. గతంలో కూడా చాలా బెనిఫిట్ షోలు జరిగాయ్.. కానీ హీరోలు ఎప్పుడు వచ్చారు.. ఎప్పుడు వెళ్లారు అనేది కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగింది. హీరో వస్తున్నాడు అంటేనే సెకన్స్ లో న్యూస్ తెలిసిపోతోంది. ప్రజలకంటే కూడా మీడియావాళ్లే నెట్టేసేలాగా కనిపిస్తున్నారు. ఇదే ప్రాబ్లమ్ అవుతోంది.
ఈ ఇన్సిడెంట్ లో తప్పెవరిది అనే ప్రశ్న వేసుకుంటే.,, జస్ట్ పోలీస్ స్టేషన్ లో ఒక మాట చెప్పేసి వచ్చేసిన హీరోలదా.. వారికి ప్రొటక్షన్ సరిగ్గా ఇవ్వలేని బౌన్సర్ దా.., ప్రజలని కంట్రోల్ చేయలేని పోలీస్ వాళ్లదా.. ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎటువంటి భద్రత ఇవ్వలేని థియేటర్ యాజామాన్యాన్ని తప్పుబట్టాలా.. గత్యంతరం లేక పిల్లలకి సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూపిద్దామని తీస్కుని వచ్చిన పేరెంట్స్ ని తప్పుబట్టాలా.. ఇక్కడ తప్పెవరిది అనేది చాలా పెద్ద ప్రశ్న. కొంతమంది దీనికి సమాధానంగా కర్మ సిద్దాంతం చెప్తారు. వారికి అంతే ప్రాప్తం అంటారు. ఇలా అని సరిపెట్టేసుకోవాలా… లేదా హీరో నన్ను క్షమించండి ఆ కుటుంబం బాధ్యత నాది అని నష్టపరిహారం కింద 10లక్షలు , 25 లక్షలో ఇస్తే సరిపెట్టుకోవాలా… ఎంటీ దుస్థితి. ఫ్యాన్స్ చచ్చిపోతున్నా పట్టించుకోని ప్రొడ్యూసర్స్, హీరోలు , డైరెక్టర్లు కలక్షన్స్ పడిపోతుంటే మాత్రం వర్రీ అయిపోతారు. ఈ పాపం ఎవరిది.. ఇందులో ఎవరిని నిందించాలి.. ? కనీసం ఇప్పుడైనా సరే, గవర్నమెంట్ ఎవరి బాగుకోసమో కాకుండా ప్రజల బాగుకోసం ఆలోచించి ప్రీమియర్ షోలకి కఠినమైన నిర్ణయాలు, నిర్ధిష్టమైన సమయాలు పెడితే బాగుంటుందనేది సినీ పండితుల సలహా. ఏది ఏమైనా ఒక కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయింది. రేవతి మృతితో అయినా సరే.., రవికిరణాలు ఉదయించి.. సినీ మత్తులో ఉన్న ప్రజలు మేలుకుంటే చాలని అనిపిస్తోంది.

