వణుకు పుట్టిస్తున్న రాజమౌళి –  మహేష్ సినిమా

by | Dec 23, 2024 | సినిమా

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ ఖాన్స్ వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పారేసింది. మరి నెక్ట్స్ బాలీవుడ్ ని ఈ రేంజ్ లో షేక్ చేసే సినిమా ఏదా అని ఆలోచిస్తే రాజమౌళి – మహేష్ బాబు సినిమానే కళ్లముందు కనిపిస్తోంది. అసలు ఈ సినిమాకి మార్కెట్ ని కూడా ఊహించలేకపోతున్నారు. 2025లో  స్టార్ట్ కాబోతున్న ఈసినిమాపై ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.., యావత్ సినిమా  ప్రేమికులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ సమయంలో అసలు రాజమౌళి సినిమాలో ఏముంది.. ఇంతగా వణుకుపుట్టిస్తున్న అంశాలేంటి అనేది తెలుసుకుందాం..

 రాజమౌళి సినిమాకి ఉండే క్రేజ్ వేరేలెవల్ అంతే.., ముందుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమా ఎలా ఉండబోతోందనేది చెప్పేస్తారు. బేసిక్ తను అనుకున్న కథని ప్రెస్ కి చెప్పేస్తారు. అందుకే, ఫ్యాన్స్ లోనూ, సినిమా ప్రేక్షకుడిలోనూ అంచనాలు పెద్దగా ఉండవు. కథ ఇదే కదా.. అని సరిపెట్టుకుంటాడు. కానీ, తెరపైకి  ఆ కథ వచ్చేసరికి దాని కథే వేరుగా ఉంటుంది. నోరెళ్లబెట్టి మరీ సీటుకి అతుక్కుపోయి మరీ సినిమాలో లీనమైపోతారు. ఇదే రాజమౌళి స్టైల్. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి కూడా ఇదే స్టైల్ ని ఫాలో అవ్వబోతున్నారు. అందుకే, హింట్స్ మీద హింట్స్ ఇచ్చేస్తున్నారు..

 రీసెంట్ గా అమెజాన్ అడవుల నేపథ్యంలో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రాజమౌళి ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వినిపించింది. ఈసినిమాకి  విజువల్ ఎఫెక్ట్స్పరంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబోతున్నారు. ఇందుకోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ ‘ఏ స్టూడియో’తో కలిసి పని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని తెలిసింది. కథా విస్త్రృతి దృష్ట్యా రెండు పార్ట్లు అయితేనే సినిమాకు న్యాయం చేయగలమనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్ను పరిశీస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నసంగతి తెలిసింద్. అయితే ఇందులో వణుకు పుట్టించే అంశాలేంటి అనే అనుమానం రావచ్చు.. ఎందుకంటే, ఈ సినిమాలో ఆర్ ఆర్ ఆర్ కంటే కూడా ఎక్కువ జంతువులు ఉండేలా రాజమౌలి చూస్తున్నారట. అనుక్షణం ఉత్ఖంఠమైన స్క్రీన్ ప్లే తో సినిమా వేరే లెవల్లో ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు, ఇందులో టార్జాన్ లుక్ లో హీరో మహేష్  ఫుల్ గెడ్డంతో, జుట్టు పెంచుకుని కనిపిస్తాడట. దీనికి సంబంధించిన అప్టేడ్ ఏంటంటే.,   ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ను పంచుకున్నారు SS రాజమౌళి. రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా అదే ప్రదేశం నుంచి  కొన్ని చిత్రాలు, వీడియోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం లొకేషన్ వేటలో ఉన్నారని కార్తికేయ హింట్ ఇచ్చాడు. రాజమౌళి కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ను రాజమౌళి సందర్శించారు. ఆ ఫ్రేమ్లో చాలా జీబ్రాలు కూడా కనిపిస్తాయి. 

ఈ  సినిమాకి సంబంధించిన షూటింగ్ లొకేషన్స్ కు వెతికే పనిలో పడ్డారు రాజమౌళి. బాహుబలి, బాహుబలి 2, RRR వంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ అందించిన రాజమౌళి.. మహేష్ బాబు సినిమాను ప్రపంచ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. అయితే ఇందులోని కొన్ని ముఖ్యమైన భాగాలను విదేశాల్లో కూడా చిత్రీకరించనున్నారని సమాచారం తెలుస్తోంది. ఇక ఈసినిమాకి ఎప్పుడూ లేని విధంగా 1000 కోట్లు మేకింగ్ లోనే ఖర్చుపెట్టేలా కనిపిస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది ఈసినిమా. ఇప్పుడు టార్గెట్ బాలీవుడ్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ గా హాలీవుడ్ ని సైతం వణికించాలనేది రాజమౌళి ప్లాన్.

రాజమౌళి – మహేష్ 2000 కోట్ల (నెట్) మార్క్ ను టార్గెట్ చేస్తారా