ప్రస్తుతం దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నా సరే., ఆ తర్వాత ప్రధాని అయ్యే ఆర్హత ఎవరికి ఉందా అని ఆరాతీస్తే అన్నివిదాలుగా యోగి ఆదిత్యనాథ్ పేరే వినిపిస్తోంది. ఎన్టీయే కూటమి మరోసారి అదికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రధానమంత్రిలో మార్పుని చూడచ్చని అంటున్నారు .రాజకీయ విశ్లేషకులు. అసలు యోగి ఆదిత్యనాధ్ ఎవరు.. ఎందుకు ఆయనకి ప్రధాని అయ్యే క్వాలిటీస్ ఉన్నాయనేది తెలుసుకుందాం
యోగి ఆధిత్యనాథ్ అంటే ఉత్తర ప్రదేశ్ లో గూండాలకి , రౌడీలకి హడల్.. ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అంటేనే దేశంలో అందరూ భయపడే రాష్ట్రం. జంగల్ స్టేట్ అనేవాళ్లు. ఎందుకంటే అక్కడ గూండాలు, రౌడీలు , కులమతాల గొడవలు, గ్యాంగ్ స్టార్ వీటన్నింటికీ పెట్టింది పేరు. కానీ, ఒక్కసారి యోగి ఆదిత్యనాథ్ సిఎం అయిన తర్వాత దాని స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని స్టేట్స్ లో కంటే కూడా అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుపోతోంది. అందుకే, యోగి ఆదిత్యనాథ్ సిఎం మాత్రమే కాదు, దేశానికే పిఎం అయ్యే అర్హత ఉన్నవాడని పార్టీ శ్రేణులు సైత అభిప్రాయపడుతుంటాయి. యోగి ఆదిత్యనాధ్ అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్. కానీ, ప్రస్తుతం అందరూ యోగి ఆదిత్యనాథ్ అని, యోగి ఆదిత్యనాధ్ జి మోహన్ రాజ్ అని పిలుస్తున్నారు. అశలు ఈయన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారు.. ఎందుకీ క్రేజ్ .. పిఎం అయ్యే సీన్ ఉందా అనేది చాలామంది మదిలో డౌట్స్ ఉన్నాయ్. నిజానికి ఉత్తర్ ప్రదేశ్ కి సిఎం అయిన తర్వాత యోగి స్టేట్ ఫేస్ ని పూర్తిగా మార్చేశారు.
మోదీ లాగానే యోగికి కూడా పెళ్లికాలేదు. అంతేకాదు, కుటుంబ సభ్యులతో సంబంధాలు సైతం తెంచుకున్న గురువు యోగి. 1990వ సంవత్సరంలో యోగి గోరఖ్ నాధ్ మఠానికి చేరి అక్కడ పీఠాధిపతి అయిన మహంత్ వైద్యనాధ్ దగ్గర శిష్యుడిగా చేరారు. 1994 లో మహంత్ వైద్యనాధ్ గురువు నుంచీ సన్యాస దీక్షని స్వీకరించి అతి చిన్నవయసులోనే కుటుంబ సభ్యులతో సంబంధాలని తెంచుకున్నారు. అంతేకాదు, సన్యాస దీక్ష తీసుకునే వరకూ కూడా ఎలాంటి వివాహం చేసుకోలేదు యోగి. 26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో తొలిసారిగా గోరఖ్పూర్ నుంచి ఎన్నికైనప్పుడు పార్లమెంటులో అతిపిన్న వయస్కుడు యోగి ఆదిత్యనాధ్ కావడం విశేషం. అదే నియోజకవర్గం నుంచి అయిదుసార్లు 1998, 1999, 2004, 2009, 2014 లో కూడా యోగినే ఎన్నికయ్యారు. గోరఖ్నాథ్ మఠాధిపతిగా , ఎంపిగా రెండు బాధ్యతలని చూసుకుంటూ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారు యోగి ఆధిత్యనాథ్. అందుకే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి కూడా అన్ని విధాలుగా అర్హుడు అనే న్యూస్ వినిపిస్తోంది.
ప్రస్తుతం బిజెపీ పార్టీలో బలమైన నాయకులే ఉన్నారు. అమిత్ షా ది చాలా బలంగా వినిపించే పేరు. అయితే, రీసంట్ గా మోదీ తర్వాత ప్రధాని ఎవరు అనే సర్వే చేసినపుడు ప్ధానంగా అమిత్ షా పేరే వినిపించింది. అయితే, ఇప్పుడు మాత్రం పార్టీ శ్రేణుల్లో యోగి ఆదిత్య నాధ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. భారతదేశానికి ప్రధాని అంటే అది మామిలు విషయం కాదు., ప్రపంచ దేశాల్లోనూ మారుమోగిపోతోంది. ప్రధానిగా 10 ఏళ్ల పాలనలో ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న మోదీ.. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని ఆర్జించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన మోదీ.. ఎన్నో ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేశారు. అందుకే, అలాంటి పవర్ ఫుల్ పోట్స్ కి పవర్ ఫుల్ మనిషి కావాలనేది అందరి ఆకాంక్ష. అంతేకాదు, భారదేశం ఇప్పుడు పూర్తిగా హిందూ దేశంగా మార్చాలన్నది బిజెపీ పట్టుదల. దీనికి యోగి లాంటి వారని పిఎం ని చేస్తే కరెక్ట్ గా ఉంటుందని చాలామంది అభిప్రాయం..
బీజేపీలో నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరూ అని అడిగినపుడు రకరకాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. దీనిపైనే తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో పలువురి పేర్లు వెల్లడి అయ్యాయి. నరేంద్ర మోదీని చూసి బీజేపీకి ఓటు వేసేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. 2014 తోపాటు 2019 సార్వత్రిక ఎన్నికలు, 2024 ఎన్నికల్లో బిజెపీ తిరిగులేని ఆదిపత్యాన్నని చూపించింది. కొన్ని ప్రాంతల్లో సీనియర్ పార్టీ కాంగ్రెస్ గెలిచినా కూడా మెజారిటీ సంపాదించలేపోయాయి. అందుకే, మోదీ సర్కార్ హ్యాట్రిక్ విజయాలని సొంతం చేసుకుంది. అయితే, ఇప్పుడు మోదీ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు అనేదానిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దానిపై కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీలో చాణుక్యుడిగా పిలుచుకునే అమిత్ షా.. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానంలో కేంద్ర రవాణాశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నిలిచారు.ఇక్కడే అసలు మెలిక ఉంది. పార్టీలో అమిత్ షా కంటే కూడా పవర్ ఫుల్ లీడర్ యోగి ఆదిత్యనాథ్ అనే చెప్తున్నారు అందరూ. ఎందుకంటే.,
ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీస్కున్నప్పటి నుంచీ రౌడీ మూకల ఆగడాలని అడ్డుకున్నారు. గూండాలకి బుద్ది చెప్పారు. నక్సలిజానికి అణచి వేశారు. గ్యాంగ్ స్టర్స్ గుండెల్లో తూటాలు దింపారు.2007లో మతపరమైన అల్లర్లని సృష్టిస్తున్న కారణంగా యోగి ఆదిత్యనాథ్ ని అరెస్ట్ చేశారు. 11రోజులు జైల్లో ఉన్న తర్వాత యోగి బైల్ పై రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత అధికారంలో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం తనని వేధిస్తోందని చెప్పి, ఎంపి గా ఉన్న నన్నే ఇలా వేధిస్తుంటే, మిగతా వారి సంగతేంటని లోక్ సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు యోగి ఆధిత్యనాధ్. అప్పట్నుంచీ పార్టీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక 32శాఖలని తన నియంత్రణలో ఉంచుకుని ఒక నియంతలా వాటిని పరిపాలించేవాడు. దీంతో యోగి చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలని తీస్కున్నారు. భూతకాలం బూజులని దులిపేస్తే, ఉపాధి అవకాశాలకి మెరుగులు దిద్దుతూ యోగి ఆధిత్యనాధ్ ఎక్కడా తగ్గేదేలే అంటూ అడుగులు ముందుకు వేస్తున్నారు.
చంపడానికి సిద్ధం.. చావడానికి సిద్ధం.. చచ్చినవాళ్లు లేచి రావడానికి కూడా సిద్ధం. అన్నట్లుగా ఉంది యోగి ఆధిత్యనాథ్ పరిపాలన. .
అందుకే, పిఎం మోడీ సైతం తన వారసుడిగా యోగినే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయంటే ఆయన పరిపాలన ఎలా ఉందో అర్ధం చేస్కోవచ్చు

