సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు పంపించారు. రేపు ఉదయం, అంటే మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు
శనివారం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట విషయం పై మాట్లాడటం, ఆ తరువాత, అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడం, అంతే కాకుండా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందని పోలీసులు తనకు చెప్పలేదని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆదివారం పోలీసులు సంధ్య థియేటర్ వద్ద ఆ రోజు ఏం జరిగిందనే దానిమీద సీసీ కెమెరా వీడియోలు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే
అండర్ ట్రయల్ ఖైదీ గా, నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తరవాత, ఈ రోజు సోమవారం రాత్రి చిక్కడపల్లి పొలిసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం (అనగా మంగళవారం) 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు పంపారు.

