అప్పుడు జానీ మాస్టర్, మరి ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వెనక్కి తీసుకుంటారా..!
పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జరుగుతున్నా పరిణామాల మధ్య అల్లు అర్జున్ జాతీయ అవార్డు వెనక్కి తీసుకుంటారా
ఆ మధ్య నృత్య దర్శకుడు జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఒక మహిళ ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై POSCO చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అనంతరం అవార్డుల కమిటీ జానీ మాస్టర్ కి వచ్చిన అవార్డు ని క్యాన్సిల్ చేసింది.
ఆ తరవాత సుమారు 36 రోజుల జైలు జీవితం అనంతరం జానీ మాస్టర్ జైలు నుండి విడుదల అయ్యాడు. ఆ తర్వాత ఆ కేసు ఏమైంది. ఫిర్యాదు చేసిన మహిళా ఎక్కడుంది, ఆమె ఫిర్యాదులో నిజ నిజాలు ఎంత ఎంత అని తెలుసుకునేవరకు అవార్డుల కమిటీ ఆగలేదు.
మరి ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేస్తారా. ఇక్కడ, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక వ్యక్తి (రేవతి) మృతి చెందింది. 9 ఏళ్ళ శ్రీ తేజ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
ఒక స్మగ్గలర్ ని హీరో గా చూపించి పోలీసులని కించ పరిచేలా చూపించిన పుష్ప లాంటి సినిమాలో నటించిన అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. నిన్న ఈనాడు పేపర్ లో చదివాం, మహారాష్ట్రలో ఒక స్మగ్లర్ ని పుష్ప సినిమా చూస్తుండగా పోలీసులు అరెస్ట్ చేయడం. పుష్ప సినిమా అల్లు అర్జున్ కి లెర్నింగ్ కర్వ్ ల లేదు. స్మగ్లర్స్ కు లెర్నింగ్ కర్వ్ ల ఉంది.
ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు. అవార్డుల కమిటీ ఎందుకు సైలెంట్ గా ఉంది. అవార్డుల కమిటీ లో కూడా మనుషులే ఉంటారు, అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ ఇవ్వడం కమిటీ సభ్యుల పర్సనల్ అభిప్రాయం. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా, 13 మంది సభ్యులు ఉన్న నేషనల్ అవార్డుల కమిటీకి నచ్చితే నేషనల్ వార్డ్ గారంటీ
అవార్డుల కమిటీకి సూటి ప్రశ్న, పుష్ప లాంటి సినిమాలకి నేషనల్ అవార్డు ఇచ్చి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. జై భీం సినిమా వీళ్ళకి కనపడలేదా, అర్ధమవలేదా. జై భీం కు నేషనల్ అవార్డు ఎందుకు ఇవ్వలేదు.
టికెట్ రేట్లు పెంచుకుని కలెక్షన్స్ భారీగా దండుకునేటప్పుడు, సమాజానికి మేలు చేయకపోయినా, సమాజాన్ని పాడుచేసే సినెమాలు తీయకూడదు. అటువంటి సినిమాలకు నేషనల్ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం ఇంకా దారుణం
ఆలోచించండి, మేల్కోండి.

