కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 28న సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఈ టీజర్ నిడివి 1 నిమిషం 34 సెకన్లు ఉండనుందని మేకర్స్ వెల్లడించారు.
కాగా, యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, సునీల్, ప్రభు ఇతక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

