ఛాంపియన్స్ ట్రోఫీ లో గ్రూప్ బి సమీకరణాలు ఆసక్తికరం గా మారాయి.
గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా జట్లు ఉన్నాయి. నాలుగు జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడాయి.
ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించింది
సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది
ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా జట్లు ఆడిన రెండు మ్యాచ్ లలో ఒక్కొక్క విజయాన్ని సాధించాయి
ఇంకా మూడు లీగ్ మ్యాచ్ లు ఉన్నాయి. ఇందులో గ్రూప్ బి కి సంబంధించిన మ్యాచ్ లు రెండు ఉన్నాయి. ఫిబ్రవరి 28 ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్, మార్చ్ 1 న సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ ఉన్నాయి
ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే 5 పాయింట్ లతో సెమి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఒక వేళ, ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే 4 పాయింట్లు వచ్చి నెట్ రన్ రేట్ మైనస్ నుండి ప్లస్ కు మారె అవకాశాలు ఉన్నాయి.
సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ లో, సౌత్ ఆఫ్రికా గెలిస్తే 5 పాయింట్ల తో నేరుగా సెమి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఒక వేళ, ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిన ఇంగ్లాండ్, టోర్నమెంట్ నుండి విజయంతో బయటకు రావాలని, కసి తీరా ఆడి సౌత్ ఆఫ్రికా ను ఓడిస్తే లెక్కలు మారతాయి
కాబట్టి సెమి ఫైనల్ బెర్త్ ఖాయం కావాలంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు ఈ మ్యాచ్ లు గెలవాలి
ఒక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ మరో మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం, ఆఫ్ఘానిస్తాన్ పాయింట్ ల పట్టికలో అగ్రస్థానం తో నేరుగా సెమి ఫైనల్ కు వెళుతుంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు మూడు పాయింట్ లతో సమానంగా ఉంటారు కాబట్టి, నెట్ రన్ రేట్ కీలకం కానుంది. నెట్ రన్ రేట్ లో మెరుగ్గా ఉన్న సౌత్ ఆఫ్రికాకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
అయితే ఆఫ్ఘానిస్తాన్ పై, ఆస్ట్రేలియా గెలిస్తే, సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మీద ఓడిపోయినా 3 పాయింట్ లతో సెమి ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
దీని బట్టి ఇక ముందు జరగబోయే మ్యాచ్ లన్ని ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా ఉండడం గ్యారంటీ.
పాయింట్స్ టేబుల్ ప్రస్తుతానికి
| Team | Matches | Won | Lost | NR | Points | NRR |
| South Africa | 2 | 1 | 0 | 1 | 3 | +2.14 |
| Australia | 2 | 1 | 0 | 1 | 3 | +0.47 |
| Afghanisthan | 2 | 1 | 1 | 0 | 2 | -0.99 |
| England | 2 | 0 | 2 | 0 | 0 | -0.30 |

