బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో చిత్రం తర్వాత మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ మూవీ రానుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా… రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. అతని నాన్నమ్మ సికందర్ అని పేరు పెట్టింది. తాత సంజయ్ అని పేరు పెట్టాడు. కానీ అక్కడి ప్రజలు మాత్రం అతడిని రాజాసాబ్ అని పిలుస్తారు అంటూ మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

