నాగ చైతన్య థ్రిల్లర్ మేకింగ్ వీడియో విడుదల

by | Nov 20, 2025 | సినిమా

తండేల్ వంటి సూపర్ హిట్ సినిమా తరవాత నాగ చైతన్య నటిస్తోన్న కొత్త సినిమా తాలూకు మేకింగ్ వీడియో విదులయ్యింది.  ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది.   విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకుడు.

ప్రస్తుతానికి  24 వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దునుకుంటోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.  ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్  ను ఈ నెల 23 న విడుదల చేస్తున్నట్లుగా ఒక మేకింగ్ వీడియో ను విడుదల చేశారు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.