𝑻𝒊𝒎𝒆 𝒎𝒊𝒈𝒉𝒕 𝒄𝒉𝒂𝒏𝒈𝒆, 𝒃𝒖𝒕 𝒏𝒐𝒕 𝒕𝒉𝒆 “𝐌𝐄𝐆𝐀𝐒𝐓𝐀𝐑“. 𝑯𝒆 𝒊𝒔 𝒕𝒊𝒎𝒆𝒍𝒆𝒔𝒔

by | Nov 20, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం ఈ నెల 21 న విడుదలవుతోంది.   1990 లో విడుదలైన కొదమ సింహం సినిమాను 4 కె లో రీ-మాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు.  రమా ఫిలిమ్స్ పతాకంపై కైకాల సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.  కె మురళీమోహన రావు ఈ చిత్రానికి దర్శకుడు. రాజ్-కోటి ద్వయం ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించారు

కొదమ సింహం (Kodama Simham) లోని ఐకానిక్ స్టిల్ ఇప్పటికి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉంది.  అదే ఫోజ్ తో మెగా స్టార్ చిరంజీవి ఒక లుక్ ఇచ్చారు. టోపీ లేదు కానీ బ్యాక్ డ్రాప్ లో కొదమ సింహం ఐకానిక్ లుక్ ఉంది

ఇంతకు ముందు చిరంజీవి కొదమ సింహం సినిమాకు సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు.  ఈ చిత్రంలో ఒక సన్నివేశానికి ఇన్సెప్షన్ సినిమాకు ఉన్న లింక్ గురించి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).  ఈ సినిమాలో ‘స్టార్ స్టార్.. మెగాస్టార్’ అనే పాటలో చిరంజీవి నేల మీద నుంచి గోడ పైకి ఆ తరవాత రూఫ్ మీద నుంచి మళ్ళీ నేల మీద కు వస్తారు.  360 డిగ్రీలు  నడిచి తిరిగి నేల మీదకు రావడం అన్నమాట.  ఈ సన్నివేశం ఇన్సెప్షన్ సినిమాలో కూడా  ఉంది.  అప్పట్లోనే ఈ సన్నివేశాన్ని ఒక షాట్ లోనే తీశారు. పెద్ద వీల్ మీద సెట్ వేసి ఆ వీల్ తిరుగుతుంటుంది. దానికి కెమెరా ఫిక్స్ చేశారు.  అంతే కాకుండా ఈ కొదమ సింహం సినిమా రామ్ చరణ్ కు బాగా ఇస్తామని చెప్పారు. 

ఇంకా ప్రభు దేవా కొరియోగ్రఫీ గురించి, మోహన్ బాబు నటన గురించి, రాజ్ కోటి ల సంగీతం గురించి మెగా స్టార్ చిరంజీవి మాట్లాడారు.

కొదమ సింహం రేపు (November 21) రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాలోని పాటలు పాడారు.