ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

by | Nov 19, 2025 | వార్తలు

ఈ రోజు పుట్టపర్తిలో సత్య సాయి శత జయంతి వేడుకలు జరిగాయి.  మెగా స్టార్ చిరంజీవి ఈ వేడుకలపై ఎక్స్ వేదికగా స్పందించారు

“మానవ సేవయే – మాధవ సేవ” అనే స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన భగవాన్ “శ్రీ సత్యసాయి బాబా” శత జయంతి వేడుకలు జరగడం చాలా ఆనందదాయకం.

ప్రపంచానికి ఆధ్యాత్మికతను, సేవాభావాన్ని పెంపొందించి, సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన తలపెట్టిన కార్యక్రమాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన మన మధ్య వ్యక్తిగతంగా లేకపోవచ్చు, కానీ ఆయన స్ఫూర్తి మనందరికీ మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది.

బాబా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.100 స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపు జారీ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సత్య సాయిబాబా దిగిన ఫోటో లు ఎక్స్ లో షేర్ చేశారు

ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, లోకేష్, ఐశ్వర్య రాయ్  లు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.