India Vs South Africa First Test Match in Eden Gardens : భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి, సౌత్ ఆఫ్రికా తన రెండవ ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.
రెండవ రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా 29 పరుగులతో, బాష్ 1 పరుగుతో క్రీజ్ లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్స్ లో కెప్టెన్ బావుమా టాప్ స్కోరర్
భారత జట్టు బౌలర్లలో జడేజా (Jadeja) 4 వికెట్లు తీసుకోగా, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) రెండు వికెట్లు, అక్షర్ పటేల్ (Akshar Patel) ఒక వికెట్ తీసుకున్నారు
అంతకు ముందు భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. సౌత్ ఆఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్ లో 159 పరుగులకు అల్ అవుట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.
39 పరుగులు చేసిన కే ఎల్ రాహుల్ భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Gill) 4 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెను తిరిగాడు. మూడవ స్థానానికి ప్రమోట్ అయినా వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేశాడు. రిషబ్ పంత్, జడేజా లు చెరో 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు
సౌత్ ఆఫ్రికా బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు తీయగా, జాన్సెన్ 3 వికెట్లు తీశాడు. బాష్, కేశవ్ మహారాజ్ లు తల ఒక వికెట్ తీశారు.

