ప్రస్తుతం ఎక్కడ చూసిన రాజమౌళి, మహేష్ బాబు (Mahesh Babu) ల కాంబినేషన్ లో వస్తోన్న మూవీ గురించే మాట్లాడుకునున్నారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ ను వచ్చే శనివారం అంటే నవంబర్ 15 న సాయంత్రం ఆరు గంటలకు రామోజీ ఫిలిం సిటీ లో జరగనుంది. ఈ లాంచ్ ఈవెంట్ ను జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో ఎక్సక్లూసివ్ గా స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇప్పటికే ఇండియాలోనే అతి సినిమా లాంచ్ ఈవెంట్ అని ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ (Durga Arts) ప్రకటించింది
ఈ వారం అంతా సర్ ప్రైజ్ లు ఉంటాయని దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)చెప్పారు. మొదటగా విలన్ పాత్రధారి పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithiviraj Sukumaran) తాలూకు కుంభ పాత్రను మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత శృతి హాసన్ (Shruthi Hasan) పాడిన ఫస్ట్ సింగల్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు, యాక్షన్ అడ్వెంచరస్ మూవీ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా మందాకినీ అనే పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమాని రాజమౌళి (rajamouli) అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళతారని అనిపిస్తోంది. పుష్ప 2 (Pushpa_ వసూళ్ల రికార్డు ను బద్దలు కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది.

