బీహార్ ఎన్నికలు 2025 : ఎగ్జిట్ పోల్స్ లో భాజపా హవా

by | Nov 11, 2025 | రాజకీయాలు

బీహార్ లో రెండు విడతలు గా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.  రెండో విడత ఎన్నికలు ఈ రోజు అనగా నవంబర్ 11 న జరిగాయి.  ఈ సారి బీహార్ ఎన్నికలలో ఒంటరిగా కన్నా కూటములు ఎక్కువగా పోటీపడ్డాయి.  హోరా హోరీగా ప్రచార పర్వం సాగింది.  పోలింగ్ కూడా ఎప్పుడు కన్నా ఎక్కువ శాతం నమోదైంది.

నవంబర్ 14 న బీహార్ అసెంబ్లీ (Bihar Assembly) ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.  అయితే   బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.  ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అధికార పార్టీ NDA కీ బీహార్ ప్రజలు అధికారాన్ని ఇస్తున్నారని తెలుస్తోంది

పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయే కూటమికి 133-159 స్థానాల్లో విజయం సాదిస్తుందని తెలుస్తోంది. మహాగట్ బంధన్ కు 75-101 సీట్లు వస్తాయని తెలిపింది

దైనిక్ భాస్కర్ ప్రకారం ఎన్డీయే కు 145-160 సీట్లు, మహాగట్ బంధన్ కు  73-91 సీట్లు వస్తాయని ప్రకటించింది.

మాట్రిజ్ ప్రకారం ఎన్డీయే కు 147-167 సీట్లు, మహాగట్ బంధన్ కు  70-90 సీట్లు వస్తాయని ప్రకటించింది. 

అంతే కాకుండా పీపుల్స్ ఇన్ సైట్  ప్రకారం న్డీయే కు 133-148 సీట్లు, మహాగట్ బంధన్ కు  87-102 సీట్లు వస్తాయని ప్రకటించింది. 

అందరికి అద్భుతమైన పొలిటికల్ స్ట్రాటజీ రచించే ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ప్రభావం నామ మాత్రమే.

బీహార్ అసెంబ్లీ అధికార పీఠం ఎక్కాలంటే 122 సీట్లు కావాలి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందో లేదా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులు చేసి మహాగట్ బంధన్ అధికారం చేజిక్కించుకుంటుందో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాలి