జీ తెలుగు ఖాతా లో మరో ప్లాప్ మూవీ

by | Nov 11, 2025 | టీవీ & ఓటిటి

జీ తెలుగు లో సూపర్ హిట్ సినిమాలు చాలా అరుదుగా, తక్కువగా కనిపిస్తాయి. చాలా సంవత్సరాల తరవాత వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొన్నారు. జనాలు ఈ సినిమాను థియేటర్ లో బాగా ఆదరించడం, ఓ టి టి లో అందుబాటులోకి రావడం వలన టీవీ లో ఈ సినిమా రెండు సార్లు మాత్రమే మంచి రేటింగ్ రాబట్టింది.

ప్రస్తుతం సుధీర్ బాబు హీరో గా వచ్చిన జటాధర సినిమా సూపర్ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాణంలో జీ స్టూడియో భాగస్వామి. ఇంతకు ముందు జీ తెలుగు వాళ్ళు సుధీర్ బాబు నటించిన మా నాన్న చిరంజీవి, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు కూడా కొన్నారు. అవి కూడా సూపర్ ప్లాప్ అయ్యాయి.

జటాధర సినిమాను త్వరలోనే జీ 5 లో, జీ తెలుగు లో చూడవచ్చు. అందుకే సినిమాలు లేక, ఉన్న సినిమాలకు రేటింగ్ లు లేక స్టార్ మా నుండి పోటీ ని తట్టుకోవడానికి జీ తెలుగు వారు ఆదివారం ప్రైమ్ టైం లో కూడా సీరియల్స్ వేస్తున్నారు.

జీ తెలుగు, సుధీర్ బాబు కాంబినేషన్ లో హ్యాట్రిక్ ప్లాప్ సినిమాలు. శ్రీదేవి సోడా సెంటర్, మా నాన్న చిరంజీవి, జటాధర. సుధీర్ బాబు క్రౌడ్ పుల్లర్ కాదని ఇప్పటికైనా జీ తెలుగు వారు తెలుసుకోవాలి