రూటు మర్చి సంక్రాంతికి వస్తోన్న మాస్ మహారాజ్

by | Nov 11, 2025 | సినిమా

రవి తేజ అంటేనే ఎనర్జీ, మాస్ ఎలెమెంట్స్. అయితే వీటికి భిన్నంగా సరికొత్త అవతారంలో ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా తో వస్తున్నాడు.

వరస ప్లాప్ లతో ఉన్న మాస్ మహారాజ్ రవి తేజ మొదటిసారిగా ఫామిలీ ఎంటర్టైనర్ టాగ్ తో వస్తున్నాడు. అదికూడా 2026 సంక్రాంతికి. ఇప్పటికే సంక్రాంతి రేస్ లో చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు, ప్రభాస్ నటించిన రాజా సాబ్, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమాలు ఉన్నాయి. కుటుంబ కధా చిత్రాల విడుదలకు సరైన సీజన్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండగ.

నేను శైలజ తరవాత సరైన హిట్లు లేక సతమవుతున్న కిశోరె తిరుమల ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రానికి దర్శకుడు. ఎస్ ఎల్ వి సినిమా పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి స్వరాలూ సమకూరుస్తున్నారు.


ఈ రోజు విడుదల చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ గ్లిమ్ప్స్ ఆసక్తి ని రేకెత్తించేవిధంగా ఉంది. ఇందులో హీరోయిన్ లు అధిక రంగనాధ్, డింపుల్ హయతి లు రవి తేజ పాత్రకు ఒక ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్నకు చాట్ గిప్ట్, జెమినీ, గూగుల్, పెళ్ళైన మగాళ్లు, మొగుళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారట. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి అనేది వెండి తెరపై చూడాలి.

ఇప్పుడు ఈ సినిమా హిట్ అవడం దర్శకుడు కిశోర్ తిరుమలకు, రవి తేజ కు చాలా అవసరం. సినిమా ఏ మాత్రం పరవాలేదు అనిపించినా సంక్రాంతి వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయినట్లే.