SSMB29 : India’s Biggest launch event.. అభిమానులకు పండగే

by | Nov 9, 2025 | సినిమా

మహేష్ బాబు, రాజమౌళి కంబినేషన్ లో వస్తోన్న సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఇటీవలే ఈ చిత్రంలో విలన్ గా నటిస్తోన్న ప్రిథ్వీరాజ్ సుకుమారన్, కుంభ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి.  ఈ వారం అంతా ఈ సినిమా తాలూకు విశేషాలు పంచుకుంటామని ఇప్పటికే చెప్పారు.  నవంబర్ 11 న, ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.  ఇంతే కాకుండా వచ్చే శనివారం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా లాంచ్ ఈవెంట్ ను చేయబోతున్నారు.  ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ ఈవెంట్ ఇండియా లోనే అతి పెద్ద లాంచ్ ఈవెంట్ ఉండబోతోందని ప్రకటించారు.

హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఈవెంట్ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది.  ఆంతే కాకుండా ఈ ఈవెంట్ కు సుమారు లక్ష మంది వరకు హాజరవుతారని తెలుస్తోంది