సైమా సినీ అవార్డుల పండగ ఈవెంట్….చూసేయండి

by | Nov 9, 2025 | సినిమా

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 (సీమ) వేడుక దుబాయ్ లో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. 2024 లో విడుదలైన చిత్రాలకు సంబందించి ఈ అవార్డులు అందచేశారు.

పుష్ప 2 (Pushpa) , కల్కి (Kalki) చిత్రాలు ఎక్కువ అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ (Allu Arjun) గెలుచుకోగా, ఉత్తమ నటి అవార్డు ను రష్మిక (Rashmika) మందాన గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ లు ఈ సైమా అవార్డులు గెలుచుకున్నారు.

ఈ అవార్డుల వేడుకను సైమా తన యూట్యూబ్ ఛానల్ లో ఉంచింది.  ఈ వేడుకను జెమినీ టీవీ (Gemini TV) వారు ఈ రోజు మధ్యాహ్నం  3 గంటలకు ప్రసారం చేశారు.