హైదరాబాద్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఒక సీనియర్ విలేకరి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ని కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రశ్న వేశారు
విలేఖరి ప్రశ్న : కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూలేశ్వరం అని అన్నారు. దానిపై ఎంక్వయిరీ కమిషన్ కూడా వేశారు. ఎంక్వయిరీ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ప్రస్తావించింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఏమి చర్యలు తీసుకోలేదు. మీరు చర్యలు తీసుకోపోగా, కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడంలేదు అంటున్నారు.
ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానంగా, ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం కక్ష కట్టి విచారణ చేస్తోందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ లో చర్చ జరిగిన తరవాత దీనిని దేశంలో అతి పెద్ద విచారణ సంస్థ అయిన సిబిఐ కి ఇచ్చాము. అంతకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఎటిఎం గా మర్చి వేల కోట్లు కెసిఆర్ కుటుంబం దోపిడీ చేసింది అని చెప్పారు. అంతే కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాకు సిబిఐ కి అప్పగించండి 48 గంటల్లో దోషులను జైలు లో పెట్టి నిర్బంధిస్తాము అని చెప్పారు. అసెంబ్లీ లో మెజారిటీ శాసన సభ్యుల ఆమోదం సిబిఐ కి అప్పగించాము. మూడు నెలలు అయినా కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పై ముందుకు కదలలేదు. సిబిఐ కాళ్లకు బంధం వేస్తున్నది ఎవరు అనేది తేల్చాల్సింది మీడియా మిత్రులే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

