రజనీకాంత్, కమల్ హాసన్ మధ్య గొప్ప స్నేహ బంధం ఉంది. దీని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీళ్లిద్దరు ఒక ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగితే అది కదా సెన్సేషన్.
ఇప్పుడు తలైవా 173 ప్రాజెక్ట్ కోసం మళ్ళి కమల్ హాసన్, రజనీకాంత్ లు కలుస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ మరియు రెడ్ జైంట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రానికి సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచలం తరవాత రజనీకాంత్, సుందర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిదే.
రజనీకాంత్, కమల్ హాసన్, సుందర్ ఈ ముగ్గురు ఈ ప్రాజెక్ట్ నిమిత్తం కలిసిన వీడియో ను ‘ది గోల్డెన్ ఈరా రిటర్న్స్’ పేరుతో రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ వారు ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో కమల్ హాసన్, రజని కాంత్ ల మైత్రిని పెంపొందించేలా ఉంది.

