మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది సినిమా నుండి చికిరి చికిరి పాటను విడుదలయ్యింది. ఈ పాట విడుదలైన రోజు నుండి రికార్డులు సృష్టిస్తోంది. స్పీకర్ లు పగిలిపోయేలా దేశ వ్యాప్తంగా మోత మోగిస్తోంది.
ఈ సినిమాకు విలక్షణ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. పాటల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు దర్శకుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ఉప్పెన చిత్రంలో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ సారి దర్శకుడు బుచ్చిబాబు, జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఏ ఆర్ రెహ్మాన్ తో జత కలిశాడు.
మరి ఇంకా దేశ వ్యాప్తంగా మోత మోగాల్సిందే అన్నట్లుగా మొదటి పాత చికిరి చికిరి సాంగ్ రికార్డ్స్ బద్దలు కొడుతోంది
ఇండియన్ సినిమా చరిత్రలోనే పాట విడుదలైన ఒక్క రోజులో అంటే 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే, ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి సినిమా గా రికార్డు సృష్టించింది. గతంలో 24 గంటల్లో 32 మిలియన్ వ్యూస్ సాధించిన రికార్డు ను మన పెద్ది చికిరి చికిరి సాంగ్ తో 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ తో అధిగమించాడు
బాలాజీ రాసిన ఈ పాటను మోహిత్ చౌహన్ ఆలపించారు. జాహ్నవి కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్. మార్చ్ 27, 2026 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్లుగా గతంలోనే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కి రామ్ చరణ్ డాన్స్ …వీరిద్దరికి ఏ ఆర్ రెహ్మాన్, బుచ్చిబాబు తోడైతే మరి పాన్ ఇండియా రికార్డు లు కాక ఇంకేం వస్తాయి.

