స్టార్ మా లో ఈ రోజు బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 9 లాంచ్ ఈవెంట్ ప్రసారమయ్యింది. ఈ సారి బిగ్ బాస్ లో నాగార్జున (Nagarjuna) కు కూడా టెస్ట్ లు పెట్టారు బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ సీజన్ 9 డబల్ హౌస్, డబల్ డోస్ అని నాగ్ చెప్పారు. అంతే ఈ సారి చదరంగం కాదు రణరంగం అని చెప్పారు
జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో ప్రసారమయిన బిగ్ బాస్ (Bigg Boss) అగ్ని పరీక్షలో 15 మంది పాల్గొనగా అందులో నుండి 13 మందిని బిగ్ బాస్ లాంచ్ ఈవెంట్ స్టేజి మీదకు తీసుకు వచ్చారు నాగార్జున. ఈ 13 మంది లో 5 గురికి మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉంది అని చెప్పారు. అది కూడా, ఆ ఐదుగురిలో ముగ్గురిని పబ్లిక్ వేసే ఓట్ల ద్వారా, ఇద్దరిని, బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జి లు ఎంపిక చేయడం ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారు
ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో, బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఎవరు వెళ్లారో చూద్దాం. ముందుగా సెలెబ్రెటీల గురించి తెలుసుకుందాం
తనూజ (Thanuja) : జీ తెలుగు ముద్ద మందారం సీరియల్ తో పాపులర్ అయిన తనూజ మొదటగా హౌస్ లోకి వెళ్ళింది. ఈ మధ్య స్టార్ మా (Star Maa) వారి కుకూ విత్ జాతి రత్నాలు షో లో కూడా పార్టిసిపేట్ చేసింది. నాగార్జున కు మటన్ బిర్యానీ చేసి తీసుకు వచ్చింది కూడా
ఫ్లోరా షైని (ఆషా షైని) Aasha Shyni : చాలా బాగుంది, నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలతో బాగా పాపులర్ అయిన ఆషా షైని. అయితే ఆషా షైని తన స్క్రీన్ పేరు అని, అసలు పేరు ఫ్లోరా షైని అని నాగార్జునకు చెప్పింది.
ఇమ్మానుయేల్ (Emmanuel) : ఈటీవీ జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన ఇమ్మానుయేల్.
ష్రస్టీ వర్మ (Shrasti Varma) : కొరియోగ్రాఫర్ ష్రస్టీ వర్మ. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసింది. పుష్ప 2 సినిమాకు కూడా పని చేసింది.
భరణి (Bharani) : టీవీ సీరియల్స్, సినిమాలలో నెగటివ్ పాత్రలు పోషించే నటుడు భరణి
రీతూ చౌదరి (Ritu Chowdari) : ఈటీవీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లతో బాగా పాపులర్ అయిన రీతూ చౌదరి
సంజన (Sanjana) : నటి, మోడల్ సంజన. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ తో నటించింది.
రాము రాథోడ్ (Ramu Rathod) : పల్లె పాటలతో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీ. మరి ముఖ్యంగా ఈ మధ్య బాగా పాపులర్ అయినా రాను… ముంబై కి రాను అనే పాట తో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపాడు
సుమన్ శెట్టి( Suman Shetty) : కమెడియన్ సుమన్ శెట్టి. దర్శకుడు తేజ పరిచయం చేసిన నటుడు. జై, జయం, కబడ్డీ కబడ్డీ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాడు
బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన సామాన్యులు (Commoners) ఎవరో చూద్దాం
కళ్యాణ్ పడాల (Kalyan Padala) : ఇతను ఒక సోల్జర్ అని తెలుస్తోంది
మాస్క్ మాన్ హరీష్(Mask Maan Harish) : నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు అనే పేరు ఉంది హరీష్ కు. బిగ్ బాస్ నుండి ఎంతో నేర్చుకున్నాను అంతే కాక బిగ్ బాస్, నాకు ఒక కేస్ స్టడీ అని హరీష్ చెప్పాడు
డెమోన్ పవన్ (Demon Pawan) : నటుడు భరణి తో బిగ్ బాస్ లాంచ్ స్టేజి మీద 60 పుషప్ లు తీశాడు మనవాడు
శ్రీజ (Srija) : వాగుడు కాయ శ్రీజ. భయం, బెరుకు లేకుండా స్టేజి మీదకు వచ్చి ముగ్గురు జడ్జి లకు ఝలక్ ఇచ్చిన శ్రీజ. శ్రీజ ఇంటి పేరు దమ్ము. ఆ దమ్ము శ్రీజ లో కూడా ఉంది నవదీప్ అన్నారు
ప్రియ (Priya) : వృత్తి రీత్యా డాక్టర్.
మర్యాద మనీష్ (Maryada Manish) : యాంకర్ శ్రీ ముఖి రిక్వెస్ట్ చేయడంతో నాగార్జున మరొక సామాన్యు డు మర్యాద మనీష్ ను లోపలికి పంపడానికి అనుమతిచ్చారు
బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 9 రేపటి నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారమవుతుంది. శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు నాగార్జున (Nagarjuna) ఎపిసోడ్ లు ప్రసారమవుతాయి.
రాత్రి 9.30 కు ప్రసారమయ్యే నువ్వుంటే నా జతగా సీరియల్ సెప్టెంబర్ 8 నుండి సాయంత్రం 6 గంటలకు ప్రసారమవబోతోంది.

