విజృంభించిన ఆర్చర్ ; ఆఖరి వన్ డే లో 72 పరుగులకే కుప్ప కూలిన సౌత్ ఆఫ్రికా
ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు వన్ డే ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు గెలిచి ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది సౌత్ ఆఫ్రికా. మూడవ వన్ డే లో ఇంగ్లాండ్ జట్టు 342 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికా పై ఘన విజయం సాధించింది
నామమాత్రపు ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 415 పరుగుల భారీ స్కోర్ చేసింది.
జో రూట్, జాకబ్ బెథెల్ లు సెంచరీలతో కదం తొక్కారు. జో రూట్100 పరుగులు , జాకబ్ బెథెల్ 110 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అంతకు ముందు ఓపెనర్ జెమీ స్మిత్ 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆఖర్లో బట్లర్ చెలరేగి ఆది కేవలం 32 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
సౌత్ ఆఫ్రికా బౌలర్ల లో బాష్, కేశవ్ మహారాజ్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
415 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన దక్షిణ ఆఫ్రికా 24 పరుగులకే 6 వికెట్ లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరవాత బాష్, కేశవ్ మహారాజ్ లు కొద్దీ సేపు ప్రతిఘటించినా, 17 పరుగులు చేసిన కేశవ్ మహారాజ్ ను రషీద్ అవుట్ చేశాడు. చివరకు, సౌత్ ఆఫ్రికా 20.5 ఓవర్ల లో 72 పరుగులకు కుప్ప కూలింది
సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లలో మార్క్రమ్, ముల్డర్ లు డక్ అవుట్ అయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్ల లో జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు, రషీద్ మూడు వికెట్లు తీయగా, కార్స్ రెండు వికెట్లు తీశాడు

