యువతరం నటులు నాగ చైతన్య, జొన్నల గడ్డ సిద్దులకు వెంకీ మామ (Venky Mama) షాక్ ఇచ్చాడు. అదెలాగా అని ఆలోచిస్తున్నారా.
ఈ శుక్రవారం విడుదలైన బార్క్ రేటింగ్స్ లో ఆగష్టు 17 ఆదివారం సాయంత్రం ప్రసారమైన చిత్రాలన్నింటిలో 20 ఏళ్ళ క్రితం వచ్చిన విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన సంక్రాంతికి అత్యధిక రేటింగ్ పాయింట్ లు వచ్చాయని తెలుస్తోంది.
అయితే, ఇందులో ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే, అదే రోజు, అంటే ఆగష్టు 17 సాయంత్రం జీ తెలుగు (Zee Telugu) లో నాగ చైతన్య (Naga Chaitanya) , సాయి పల్లవి లు (Sai Pallavi) నటించిన తండేల్ సినిమాని ప్రసారం చేశారు. తండేల్ (Thandel) సినిమా ని ప్రసారం చేయడం ఇది రెండవ సారి. అదే రోజు స్టార్ మా (Star Maa) వారు జొన్నల గడ్డ సిద్దు (Jonnalagadda Siddu) నటించిన జాక్ (Jack) సినిమా ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేశారు. అదే రోజు జెమినీ టీవీ (Gemini TV) వారు, కొత్త సినిమాలు ఏమి లేకపోవడంతో వెంకటేష్ నటించిన 20 ఏళ్ళ క్రితం సినిమా సంక్రాంతి (Sankranthi) ని ప్రసారం చేశారు.
ఇక రేటింగ్ ల వివరాలలోకి వెళితే, సంక్రాంతి సినిమా 6 రేటింగ్ పాయింట్లను సాధించిందని తెలుస్తోంది. స్టార్ మా (Star Maa) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జాక్ సినిమాకు, జీ తెలుగు (Zee Telugu) వారు రెండవ సరి ప్రసారం చేసిన తండేల్ (Thandel) సినిమాకు అంత రేటింగ్ రాలేదట.
కొత్త సినిమాలు రెండు వదిలేసి, 20 క్రితం వచ్చిన సంక్రాంతి సినిమాని జనాలు అలా ఎలా చూశారు. ఈ విషయం ఎవరికి అంతు బట్టడం లేదు.
ఈ రేటింగ్ లు ఇచ్చే, బార్క్ (BARC) సంస్థ ప్రతినిధులే ఈ రేటింగ్స్ అవకతవకల్లో భాగస్వాములయినట్లు గతంలో మీడియా ద్వారా తెలుసుకున్నాము. బార్క్ (BARC) సంస్థకు క్రెడిబిలిటీ అంతగా లేదు. రేటింగ్స్ ఇచ్చే వేరే ఏ ఇతర సంస్థలు లేకపోవడంతో బార్క్ సంస్థ మీద ఆధారపడాల్సి వస్తోంది. వాళ్ళు ఏ కార్యక్రమానికి, ఏ సినిమాకి ఎంత ఇస్తే అది అందరు తీసుకోవాలి. ఈ బార్క్ సంస్థ ఇచ్చే రేటింగ్స్ ప్రాతిపదికగా టెలివిజన్ మీడియా (Media) వ్యాపారం కోట్లలో ఉంటుంది. అయితే బార్క్ (BARC) సంస్థ క్రెడిబిలిటీ అంతగా లేక పోవడంతో, ప్రభుత్వం కొత్త సంస్థలను ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది.
టెలివిజన్ (Television) , ప్రింట్ (Print) , అవుట్ డోర్ (Outdoo) , ఓ టి టి (OTT), రేడియో (Radio) ఇలా అన్ని రకాల మాధ్యమాల రేటింగ్ లు ఇచ్చే ఒక సంస్థను అభివృద్ధి చేయాలనీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇలాంటి పద్దతి కొన్ని ఇతర దేశాలు అవలంబిస్తున్నాయి.
బార్క్ సంస్థ ప్రతినిధులే కాదు, ఒక్కోసారి, టెలివిజన్ చానెల్స్ కు చెందిన ప్రతినిధులు కూడా, మధ్యవర్తుల ద్వారా, ఈ రేటింగ్స్ ను కొంటున్నట్లు తెలుస్తోంది. అమాంతం ఎదగడానికి, ఒత్తిడి తట్టుకోవడానికి, డబ్బు సంపాదించడానికి, మీడియా ఈ విధంగా తయారవుతోంది.
ఒక్కోసారి ఒకటి, రెండు మీటర్ లు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే, రేటింగ్స్ ను మధ్యవర్తులు కంట్రోల్ చేసేయవచ్చు. ఎందుకంటె, బార్క్ శాంప్లింగ్ సిస్టం చాలా చిన్నది. ఇంకొక విషయం ఏంటంటే, బార్క్ లో పెట్టుబడిదారులు కూడా చానెల్స్, అడ్వేర్టైజింగ్ ఏజెన్సీస్ సంబందించిన వారే ఉంటారు. క్రియేటివిటీ అవసరం లేదు, బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకటి, రెండు మీటర్లు ఎక్కడున్నాయో తెలిస్తే, మనకు ఎంత కావాలంటే అంత రేటింగ్ తెచ్చుకోవచ్చు అన్నమాట
అయితే, అతి త్వరలోనే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి అవకతవకలకు చెక్ పెట్టాలని గట్టి ప్రణాళికలు రచిస్తోంది

