ఈ మధ్య టాలీవుడ్ లో విడుదలయ్యే ప్రతి సినిమాకు మొదటి వారం సినిమా టిక్కెట్ల రేట్లు పెంచడం అలవాటయ్యింది. సినిమా రివ్యూలు ఎలా ఉన్న మొదటి వారంలో సగం పెట్టుబడి లాగేయవచ్చన్న అనేది సదరు నిర్మాతల అభిప్రాయం. సినిమా బావుంటే, వసూళ్లకు ఆకాశమే హద్దు.
ఇప్పుడు ప్రస్తుతం నిర్మాత టి జి విశ్వప్రసాద్ (Viswa Prasad) ఇప్పుడున్న కల్చర్ కు వ్యతిరేకంగా, సెప్టెంబర్ 12 న విడుదలవబోయే తన కొత్త సినిమా మిరాయ్ (Miraai) కు టికెట్ రేట్లు పెంచడం లేదని ప్రకటించారు. ఎక్కువ మంది ఆడియన్స్ కు సినిమా రీచ్ అవ్వాలని సినిమా టికెట్ రేట్లు పెంచడంలేదని నిర్మాత టి జి విశ్వప్రసాద్ తెలిపారు.
సినిమా టిక్కెట్లు పెంచకపోవడం వలన, నెగటివ్ రివ్యూస్ వస్తే, మొదటికే మోసం వస్తుంది. టాక్ బాగా ఉంటె మాత్రం, భారీ ఓపెనింగ్స్ కి దెబ్బ పడే అవకాశం ఉంటుంది.
మిరాయ్ (Miraai) సినిమా ట్రైలర్ చూస్తే కల్కి(Kalki) , హనుమాన్ (Hanuman) , కార్తికేయ (Karthikeya) చిత్రాలు గుర్తుకు వస్తున్నాయి. డివైన్ టచ్ ఇచ్చి బాలీవుడ్ లో సినిమాని సూపర్ హిట్ చేయాలనీ చూస్తున్నారు, నిర్మాత, టి జి విశ్వప్రసాద్ (T G Viswaprasad)
మిరాయ్ (Miraai) సినిమా హిట్ అవడం ఈ ముగ్గురికి ప్రత్యేకమే. కార్తీక్ ఘట్టమనేని గత సినిమా ఈగల్ ప్లాప్ అయింది. హనుమాన్ వంటి పాన్ ఇండియా హిట్ తరవాత తేజ సజ్జా (Teja Sajja) హీరో గా వస్తోన్న సినిమా. అంచనాలు భారీగానే ఉన్నాయి.
వరస ప్లాప్ సినిమాలు ఇస్తోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికీ కొద్ద ఈ సినిమా హిట్ అవడం చాల అవసరం. అసలే సినిమా టికెట్ రేట్లు పెంచట్లేదని ప్రకటించారు నిర్మాత టి జి విశ్వప్రసాద్
తేజ సజ్జా (Teja Sajja) నటించిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12 విడుదలవుతోంది. సెప్టెంబర్ 5 న అనుష్క నటించిన ఘాటీ విదుడవుతోంది. ఘాటీ విడుదలైన వారానికి మిరాయి విడుదలవుతోంది. మిరాయ్ (Miraai) విడుదలైన మరో రెండు వారాలకు పవన్ కళ్యాణ్ ఓజి విడుదలవుతోంది.
ఓజి (OG) , ఘాటీ (Ghati) సినిమాల మధ్య విడుదలవుతోన్న మిరాయ్ సినిమా కు పాజిటివ్ టాక్ రావడం ఎంతో అవసరం.

