బిగ్ బాస్ సీజన్ మొదలు ; తెలుగు బిగ్ బాస్ ఆగమనం ఈ రోజే

by | Aug 28, 2025 | టీవీ & ఓటిటి

బిగ్ బాస్ – ప్రపంచ వ్యాప్తంగా ఈ షో కి ఉన్నంత ఆదరణ, వేరే ఏ షో కి లేదు అనడంలో సందేహం లేదు.   ఈ సారి బిగ్ బాస్ సరి కొత్త హంగులతో వస్తున్నట్లు ప్రోమోలు చూస్తే తెలుస్తోంది.

ఈ సారి బిగ్ బాస్ (Bigg Boss) కి కామన్ పబ్లిక్ నుంచి కొంత మందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ కి పంపిస్తున్నారు.  దీనికి సంబందించిన ఎపిసోడ్ లు ప్రస్తుతం బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో జియో స్టార్ (Jio Star) లో నడుస్తున్నాయి.

ఈ ఎపిసోడ్స్ కి శ్రీ ముఖి (Sri Mukhi) యాంకరింగ్ చేస్తోంది.  బిందుమాధవి, నవదీప్, అభిజిత్ లు జడ్జి లుగా వ్యవహరిస్తున్నారు.  ఇటీవలే నవదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి.  దీనితో ఈ విషయంలో, నవదీప్ (Navadeep) తగ్గాల్సి వచ్చింది

అంతే కాకుండా మరో వైపు నాగార్జున (Nagarjuna) ఈ సారి బిగ్ బాస్ చదరంగం కాదు రణరంగం అంటున్నారు.  అంతే కాకుండా ఈ సారి బిగ్ బాస్ నే మార్చేశారు అని ప్రోమో లో నాగ్ చెపుతున్నారు.

మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే బిగ్ బాస్ (Bigg Boss) ని చూసేయాల్సిందే.  ఈ బిగ్ బాస్ సీజన్ 9 ని, సెప్టెంబర్ 7 న లాంచ్ చేస్తున్నట్లు గా స్టార్ మా (Star Maa) వారు ప్రకటించారు.  బిగ్ బాస్ సీజన్ పండగ డిసెంబర్ వరకు ఉంటుంది.  ఈ సారి బిగ్ బాస్- సీజన్ 9 డబల్ హౌస్, డబల్ డోస్ తో (Double House and Double Dose) డబల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వస్తున్నాడు

మరో వైపు హిందీ బిగ్ బాస్ (Bigg Boss) ఈ ఆగష్టు 24 న కలర్స్ ఛానల్ లో ప్రారంభమైంది.  కన్నడ బిగ్ బాస్, కలర్స్ కన్నడ లో సెప్టెంబర్ 22 న మొదలవబోతోంది.