తేజ సజ్జా వరుస పాన్ ఇండియా సినిమా లతో జోరు మీదున్నాడు. హనుమాన్ సూపర్ హిట్ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తోన్న మిరాయ్ సినిమా లో నటిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా విభిన్నమైన కధలను ఎంచుకుంటూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు తేజ సజ్జా.
ఇది ఇలా ఉండగా తేజ సజ్జా తన పుట్టిన రోజు నాడు మరో పాన్ ఇండియా సినిమా ను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. దీనికి సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ‘రాయలసీమ నుండి ప్రపంచం అంతమయ్యేవరకు’ అనే కాప్షన్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే మిరాయ్ సినిమా హిట్ అవడం తేజ సజ్జా కెరీర్ కు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి కూడా చాలా అవసరం. బాక్స్ ఆఫీస్ వద్ద మిరాయ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. అయితే, సెప్టెంబర్ 5 న విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు మిరాయ్ సినిమా కు సంబంధించి ప్రొమోషన్స్ కూడా ఇంకా మొదలవలేదు.


