విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు – పవన్ కల్యాణ్

by | Aug 21, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి రేపు అనగా ఆగష్టు 22 తన 70 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, తమ్ముడు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు

పవన్ కల్యాణ్ మెసేజ్, మెగా అభిమానుల కోసం యధాతధంగా ఇస్తున్నాము.  ఈ మెసేజ్ చదివితే అన్నయ్య చిరంజీవి మీద, తమ్ముడు పవన్ కల్యాణ్ కి ఎంత ప్రేమ ఉందొ తెలుస్తుంది.

విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య

గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవంవెల కట్టలేని జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుంటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు.. కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయనవిశ్వంభరుడు’..! పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను

మెగాస్టార్ చిరంజీవి 70 వ పుట్టిన రోజు పురస్కరించుకుని, ఈ రోజు విశ్వంభర సినిమా కు సంబందించిన మెగా బ్లాస్ట్ ని యూవీ క్రియేషన్స్ వారు విడుదల చేశారు.

రేపు ఉదయం (ఆగష్టు 22), అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమాకి సంబంధించి టైటిల్ ను రివీల్ చేయనున్నారు.  మెగాస్టార్ చిరంజీవి 70 వ పుట్టిన రోజు, అభిమానులకు డబల్ బ్లాస్ట్