హనుమాన్ సినిమా తో పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ సజ్జా తదుపరి చిత్రం ‘మిరాయ్’. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం లో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. తేజ సజ్జా పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ‘మిరాయ్’ మేకింగ్ వీడియో ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ యోధా గా కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫాక్టరి వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

