మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన విశ్వంభర చిత్రానికి సంబందించిన మెగా బ్లాస్ట్ ఈ రోజు సాయంత్రం విడుదల చేశారు. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ఈ మెగా బ్లాస్ట్ న విడుదల చేశారు. ఈ మెగా బ్లాస్ట్ (Mega Blast) తో పాటు, ఈ విశ్వంభర (Viswambhara) సినిమా ని 2026 సమ్మర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రానికి అయిన ఖర్చు దృష్ట్యా, ఎక్కువ మందికి సినిమా రీచ్ అవ్వాలని సమ్మర్ లో విడుదల చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే, 74 సెకండ్లు ఉన్న, ఈ విశ్వంభర మెగా బ్లాస్ట్ లో మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కనిపించింది కేవలం 5 సెకండ్లు మాత్రమే.
అయితే మెగా బ్లాస్ట్ లో గ్రాఫిక్స్ మాత్రం అదిరిపోయాయి. సినిమా మీద ఇప్పటినుంచే అంచనాలు పెంచకుండా యూ వి క్రియేషన్స్ వారు జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.
ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి దీనికి సంబందించిన వీడియో విడుదల చేశారు .

