మెగాస్టార్ చిరంజీవి, విజయ శాంతి జంటగా నటించిన పసివాడి ప్రాణం సినిమా విడుదలై నేటికీ 38 ఏళ్ళు అయ్యింది. జులై 23, 1987 న విడుదలైన పసివాడి ప్రాణం సినిమా చిరంజీవి కెరీర్ లో ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పసివాడి ప్రాణం సినిమా మలయాళ చిత్రం ‘ పూవిను పుతియా పూన్ తెన్నల్’ సినిమాకు రీమేక్
గీత ఆర్ట్స్ పతాకంపై, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎ కోందండరామి రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో పసివాడి ప్రాణం ఒకటి. దిగ్గజ రచయిత, దర్శకుడు జంధ్యాల మాటలు రాశారు. లోక్ సింగ్ కెమెరా పనితనం, చక్రవర్తి సంగీతం, ఆత్రేయ, వేటూరి గారి పాటలు, ఈ సినిమా విజయవంతం కావడానికి దోహద పడ్డాయి
ఈ సినిమాలో నటించిన ఆ బాబు, ఇప్పుడు ప్రస్తుతం స్టార్ మా లో వస్తోన్న కుకు విత్ జాతిరత్నాల్లో ఒక కంటెస్టెంట్, ఆవిడే టీవీ సీరియల్స్ తో బిజీ గా ఉన్న నటి సుజిత. పసివాడి ప్రాణం సినిమాని ఏ భాషలో తీసిన ఆ బాబు పాత్ర సుజిత పోషించింది
పసివాడి ప్రాణం సినిమా హైలైట్స్
- ఈ సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు బ్రేక్ డాన్స్ ను (చక్కని చుక్కల) పరిచయం చేశారు.
- రోజు కు 5 ఆటలతో, 3 సెంటర్లలో 100 రోజులు ఆడిన సినిమా
- చిరంజీవి కి మొదటి సిల్వర్ జూబిలీ సినిమా
- పసివాడి ప్రాణం అప్పటి ఇండస్ట్రీ హిట్
- తిరుపతి ప్రతాప్ థియేటర్ లో రోజుకు 5 ఆటలతో 175 రోజులు ఆడిన సినిమా
- రష్యా లోకి డబ్ అయిన మొదటి దక్షిణ భారతీయ చిత్రం ‘ పసివాడి ప్రాణం’
- కాశ్మీర్ అందాలను చూపిస్తూ తీసిన కాశ్మీర్ లోయలో పాట సూపర్ హిట్
- పసివాడి ప్రాణం చిత్రం అప్పట్లోనే 4.75 కోట్ల షేర్ వసూలు చేసింది.
- ఈ చిత్రంలో బ్రహ్మానందం గారు ఒక అతిధి పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రకు డైలాగ్స్ ఉండవు
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమా 2026 సంక్రాంతికి వస్తోన్న విషయం తెలిసిందే. విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించాల్సిఉంది

