అల్లు అర్జున్ తెచ్చి పెట్టిన సమస్యకు, పవన్ కళ్యాణ్ ముగింపు

by | Jul 22, 2025 | సినిమా

ఇప్పటి వరకు, చరిత్రలో ఏ సినిమా టికెట్ రేట్లు, పుష్ప -2 సినిమాకు పెంచినంతగా పెంచలేదు.  భారీగా పెంచిన రేట్లతో వసూళ్ల రికార్డ్స్ ని సృష్టించిన పుష్ప-2 బాహుబలి రికార్డు లు బద్దలు కొట్టింది.

అయితే, ఒక ఫంక్షన్ లో, టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా మర్చిపోయినట్లు ప్రవర్తించాడు మన ఆటిట్యూడ్ స్టార్ అల్లు అర్జున్.  అంతే కాకుండా, పుష్ప-2 విడుదల సందర్భంగా అనుమతులు లేకుండా సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్లి అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వలన ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.  అంతే కాకుండా ఆ మహిళ కుమారుడు చాల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.

ఆ తరవాత ముఖ్యమంత్రి అసెంబ్లీ లో మాట్లాడిన మాటలకు కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ఇంకా దుమారం లేపాయి.  వరసగా జరిగిన ఈ అంశాలన్నీ,  తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం వచ్చేలా చేశాయి.  ఆ దెబ్బతో అల్లు అర్జున్ ని ఒక రాత్రి జైలు లో నిద్ర చేసే పరిస్థితి కల్పించారు.  అంతే కాకుండా ఇకపై తెలంగాణ లో బెనిఫిట్ షో లు రద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.  అంతే కాకుండా టికెట్ రేట్ల పెంపుదలను కూడా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.

అల్లు అర్జున్ చేసిన ఈ పనికి సంక్రాంతికి వచ్చిన చిత్రాలైన గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు బాగా దెబ్బ  తిన్నాయి.  సంక్రాంతి కి వస్తున్నాం సినిమా టాక్ బావుండడం వలన, పండగ కావడం చేత హిట్ అయ్యింది

అయితే చాలా రోజుల తరవాత, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు చిత్రానికి ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది.  అంతే కాకుండా, టికెట్ రేట్లను కూడా పెంచింది

నిన్న జరిగిన హరి హర వీర మల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఏ ఏం రత్నం, తెలంగాణ ప్రభుత్వ టికెట్ రేట్లు పెంచినందుకు ఒక వ్యక్తికీ ధన్యవాదాలు తెలిపారు. సదరు వ్యక్తి ఇరకాటంలో పడ్డాడు. అయితే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన.

టికెట్ రేట్లు పెంచడం మంచిదే తప్పులేదు, ప్రీమియర్ షోలకు అనుమతిచ్చి మంచిదే.  ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారు.  తన వలన నిర్మాత నష్టపోకూడదని, తాను రెమ్యూనరేషన్ తీసుకోకపోయినా, టికెట్ రేట్లు పెంచేలా చేశాడు

తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొంత మంది విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు, వారు రాజకీయాలలో వాళ్ళు కావచ్చు, మీడియా వారు కావచ్చు, సినిమా వారు కావచ్చు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచేది లేదని, ప్రీమియర్ షో లు ఉండవని చెప్పి,ఇప్పుడు మాట తప్పారని విమర్శిస్తున్నారు. 

పుష్ప-2 రిలీజ్ సమయంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో అలంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని, అంతే తప్ప, అది మాట తప్పడం కాదని, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చేయూతనివ్వడం అని అంటున్నారు

పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి గార్లు తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే రెండు, మూడు నెలలలో రాబోతున్న భారీ సినిమాలు లబ్ది పొందే అవకాశం ఉంది

మొత్తానికి అల్లు అర్జున్ తెచ్చి పెట్టిన సమస్యకు, హరి హర వీరమల్లు తో పవన్ కళ్యాణ్ గారు ముగింపు పలికారు