3500 కోట్ల మధ్యం కుంభకోణం ; జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారా!
మాజీ ముఖ్యమంత్రి, వై ఎస్ ఆర్ సి పి పార్టీ అధ్యక్షుడు అయిన జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కూటమి ప్రభుత్వంఉచ్చు బిగిస్తోందా అంటే అవుననే అనిపిస్తోంది.
ఇటీవలే మద్యం కుంభకోణం లో వైసీపీ ఎం పి మిదున్ రెడ్డి కి విజయవాడ ఏసీబీ కోర్ట్ ఆగష్టు 1 వరకు జ్యూడిషల్ రేమండ్ విధించింది. మిదున్ రెడ్డి ని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించామని ఆదేశాలు ఇచ్చింది.
సిట్ ప్రకారం ఇది 3500 కోట్ల కుంభకోణానికి సంబందించిన కేసు అని సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు తమ వాదనలు వినిపించారు
నిజంగా 3500 కోట్ల కుంభ కోణం జరిగితే మిదున్ రెడ్డి ఒక్కడే పాత్రధారి, సూత్రధారి అవుతారా, వెనకాల ఎవరు లేదా అనే ప్రశ్నలకు తావిస్తోంది. లేదా కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వైసీపీ నాయకులను ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తోందా. కొడాలి నాని, వల్లభనేని వంశి, ఇప్పుడు తాజాగా మిదున్ రెడ్డి ని జైలు కు పంపారు
వీరే కాకుండా అనేక కేసుల్లో ఇతర వైసీపీ నాయకులపై కూడా కేసులు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ప్రస్తుతం మిదున్ రెడ్డి అరెస్ట్ మాత్రం సంచలనాలకు తెర లేపింది. సిట్ చెపుతున్న ప్రకారం 3500 కోట్ల కుంభకోణంలో మిదున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అంటే ఖచితంగా దీని వెనుక వైసీపీ ఇతర పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది. ఎన్నికలలో మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ అధికారం లోకి రాగానే ఆ మాట మరచిపోయారు. ఉన్న బ్రాండ్ లను నిషేధించి జగన్ తన సొంత, కొత్త బ్రాండ్ లను తీసుకు వచ్చారు. అయన దృష్టిలో మద్యపాన నిషేధం అంటే ఉన్న బ్రాండ్ లను నిషేధించడం అన్న మాట. జగన్ తన సొంత బ్రాండ్లతో అనారోగ్యం పాలవుతున్నారని పలు విమర్శలు ఉన్నాయి
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత జగన్ మద్యం విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వం మద్యం దుకాణాలు నడపడం ఏంటి అనే అంశం పై ఆరా తీయగా మద్యం మాఫియా కుంభకోణం బయట పడింది. ప్రైవేట్ బ్రాండ్ లను, రాష్ట్రంలోకి రానీయకుండా ప్రభుత్వ మద్యం దుకాణాలతో పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది అప్పటి వైసీపీ ప్రభుత్వం
ఈ మొత్తం కుంభకోణంలో మిదున్ రెడ్డి, రాజ్ కె సి రెడ్డి ల ప్రమేయం ఉందని ఇప్పటి సిట్ పోలీస్ లు ఆధారాలను గుర్తించారు
ఈ మొత్తంలో విజయ సాయి రెడ్డి పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. అందుకే విజయ్ సాయి రెడ్డి ముందుగానే గ్రహించి పార్టీకి, పదవి కి రాజీనామా చేసినట్లుగా ఉంది
ఈ కుంభకోణంలో నెలకు 60 కోట్ల వరకు ముడుపులు అందేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది . డిస్టిలరీస్, మద్యం సరఫరా చేసి వారి దగ్గరనుండి ముడుపులు అందేలా పక్క ప్రణాలికను రచించారని తెలుస్తోంది. ఈ వచ్చిన మొత్తం ముడుపుల్లో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి కూడా వాటా వచ్చేదని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది
ఈ మొత్తం మద్యం కుంభకోణంలో మిదున్ రెడ్డి, రాజ్ కె సి రెడ్డి లను మాత్రమే దోషులుగా చూడలేము. ఈ ముడుపులు ఎవరెవరికి అందేవి, ఎంత ఎంత అందాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఎవరెవరు ఉన్నారు అనే అంశాలు తెలియాల్సి ఉంది. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో 52 రోజులు రాజమండ్రి జైలు లో ఉంచిన జగన్ మోహన్ రెడ్డి ని చంద్రబాబు అంత తేలికగా వదలరు. ఈ మద్యం కుంభకోణం లో జగన్ మోహన్ రెడ్డి కూడా పాత్రధారుడు, వాటాదారుడు అని తెలీదే అదే రాజమండ్రి జైలు కు జగన్ మోహన్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం ఉంది
ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ఎక్కువగా మాట్లాడడం లేదు. పూర్తి ఆధారాలు దొరికిన తరవాత జగన్ ను ఖచ్చితంగా జైలు కు పంపించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వానికి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది. తగినంత సమయం తీసుకుని పూర్తి ఆధారాలతో వైసీపీ పెద్ద తలకాయలను రాజమండ్రి జైలు కు పంపే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు కు ఉన్న ఏకైక అడ్డంకి వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. కాబట్టి చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ అరెస్ట్ లు వైసీపీ కి సానుభూతి కేలిగేలా ఉండకుండా, జాగ్రత్తగా పావులు కదిపే అవకాశం ఉంది. కూటమికి ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం ఉంది. ఇంతకు మించిన అవకాశం బీజేపీ కి కూడా మళ్ళి రాదు. కనీసం దక్షిణాదిన ఒక్క రాష్ట్రం లో నైనా అధికారం లో ఉన్నామని చెప్పుకోవడానికైనా, ఆ అధికారం కాపాడుకోవడాయినికైనా, నరేంద్ర మోడీ, చంద్ర బాబు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోక పోవచ్చు

