వికెట్లు తీయలేక పోతోన్న భారత బౌలర్లు, టెండూల్కర్ రికార్డు కు ఎసరు
మాంచెస్టర్ లో భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగవ టెస్ట్ లో భారత జట్టు బౌలర్లు వికెట్లు తీయలేక ఆపసోపాలు పడుతున్నారు.
భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇదే పిచ్ మీద ఇంగ్లాండ్ పేసర్లు స్టోక్స్, ఆర్చర్, వోక్స్ లు కలిసి 9 వికెట్ లు తీశారు. ముఖ్యంగా, ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ స్టోక్స్ చాలా సంవత్సరాల తరవాత 5 వికెట్లు తీశాడు.
ఇదే పిచ్ మీద, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో, భారత బౌలర్లు వికెట్లు తీయలేక తేలిపోతున్నారు. మరి ముఖ్యంగా భారత స్టార్ పేసర్ బుమ్రా 19 ఓవర్ లు బౌల్ చేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
భారత పేసర్ లు బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కాంబోజ్ లు నలుగురు కలిసి 70 ఓవర్లు బౌల్ చేసి ఒక్క వికెట్ తీయగలిగారు. ఆ ఒక్క వికెట్ అరంగేట్ర బౌలర్ కాంబోజ్ కు దక్కింది
.విదేశీ గడ్డ మీద భారత బౌలర్ల డొల్లతనం మరోసారి బయటపడింది. ముఖ్యంగా స్టార్ పేసర్ బుమ్రా వికెట్లు తీయలేకపోవడం భారత జట్టును కలవారు పెడుతోంది.
ఇంగ్లాండ్ జట్టులో మొదటి నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు అర్ధ సెంచరీ లు చేయగా, రూట్ సెంచరీ చేశాడు. రూట్ కు ఈ సిరీస్ లో రెండవ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ లో భారత స్టార్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసే అవకాశం రూట్ కు మాత్రమే ఉంది. సచిన్ టెండూల్కర్ చేసిన 15921 పరుగుల రికార్డు కు రూట్ మరో 2500 పరుగుల దూరం లో ఉన్నాడు. రూట్ వికెట్ ను పడగొట్టలేకపోతున్నారు భారత జట్టు బౌలర్లు.
ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రూట్, స్టోక్స్ క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ భారీ ఆధిక్యంగా దిశగా వెళుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ మ్యాచ్ ఓడిపోతే భారత జట్టు సిరీస్ ఓడిపోతుంది. కనీసం మ్యాచ్ ని డ్రా చేసుకుంటే సిరీస్ ని సమం చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి, భారత బౌలర్లు మరో 6 వికెట్ లు తీసి ఇంగ్లాండ్ ను అల్ అవుట్ చేయగలుగుతారో లేదో చూడాలి

